Posted on 2025-07-13 21:20:17
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈనెల 15న మంగళవారం టీఎన్జీవో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న శ్రీశ్రీశ్రీ నవదుర్గ అమ్మవారి ఆలయం నుండి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎన్జీవో ఆధ్వర్యంలో టిఎన్జీవో జిల్లా కార్యాలయం లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా, ఆషాడ బోనాల ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా, పాత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల శ్రీ శ్రీ శ్రీ నవదుర్గ మాత ఆలయ ప్రాంగణంలో బోనాల ఉత్సవాలు ఈ సంవత్సరం 15 తేదీన 11 గంటలకు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగ సోదరిమణులు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, క్లాస్ ఫోర్& డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యవర్గ బృందం, రిటైర్డ్ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ బృందం, జిల్లా ప్రజలు ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై, బోనాల ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని, తదనంతరం ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని, ఆ జగదాంబ మాతా కృపకు పాత్రులై, టీఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
ఇట్టి సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్, జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ గారు, జిల్లా కోశాధికారి దినేష్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, నిజాంబాద్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >