Posted on 2025-07-14 16:29:02
బాధితుడు మహిపాల్ రెడ్డి ఆవేదన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: డొంకేశ్వర్ మండలం గాదేపల్లి గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డి యొక్క పంట భూమి జి.జి నడుకుడ గ్రామ శివారులోని తమ సాగు భూమి 1129 సర్వేనెంబర్ లో 5 ఎకరాల ఏడు గుంటల భూమి తన పేరుపై ఉందని అయితే తమ భూమి ఇరు ప్రక్కన ఉన్న 1128, 1130 సర్వే నెంబర్లలో ఉన్న మోతే రమణ, మోతే గంగారెడ్డి లకు సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు మరో సర్వే నంబర్ కు చెందిన బద్దం మల్లారెడ్డి, గంపల కళ్యాణ్ కుటుంబ సభ్యులు తన పంట భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గతంలో డొంకేశ్వర్ మండలం సర్వేయర్ అందరికీ మూడుసార్లు నోటీసులు ఇచ్చి సర్వేనెంబర్ 1128, 1129, 1130 సర్వే భూముల్లో హద్దులు పాటించి పంచనామ చేశారని తెలిపారు. అయితే గతంలో ఆర్మూర్ ఆర్డీవో సర్వే నెంబర్ 1129కి రక్షణ కల్పించాలని నందిపేట్ ఎస్ హెచ్ ఓ కి, డొంకేశ్వర్ ఎమ్మార్వో కి ఆదేశాలు సైతం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్డీవో ఆదేశాలు స్థానిక ఎమ్మార్వో ఆదేశాలు పోలీసులకు సైతం లెక్కచేయకుండా వారు తమపై అక్రమ కేసులు బనాయిస్తూ తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇప్పటికీ కూడా అధికారుల ఆదేశాలు పట్టించుకోకుండా తమ పక్కనున్న సర్వేనెంబర్ 1128, 1130 కి చెందిన వారు ట్రాక్టర్లతో తమ పంట పొలంలో దున్నుతూ తమను సాగు చేయకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు మైపాల్ రెడ్డి వేడుకున్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >