Posted on 2025-07-15 20:08:40
ఠాణాకుర్డు లో ఈత వన మాహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ నియోజవర్గంలోని మోపాల్ మండలం బాడ్సి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లను సబ్ స్టేషన్ లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, అందులోనే భాగంగా 33/11 కె.వి విద్యుత్ డిచ్పల్లి నుండి బాడ్సి గ్రామానికి కరెంటు లైన్ ను వేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరమని, పంటలకు ఎలాంటి నష్టం లేకుండా విద్యుత్ సరఫరా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఎన్ పి డి సి ఎల్ సిఎండి వరుణ్ రెడ్డికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక లైను వేయడానికి 28 లక్షలు ఖర్చు అయిందని తెలిపారు. 120 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టమని ధర్పల్లి సబ్ డివిజన్ కోసం ప్రతిపాదనలు పంపించామని, డివిజన్ ఏర్పాటు చేసుకొని, వివిధ 12 గ్రామాలకు సబ్ స్టేషన్లు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను కోరినామని అన్నారు. విద్యుత్ శాఖ కు సంబంధించిన ఉద్యోగులు గతంలో కంటే ఈసారి బాగానే పనిచేశారని ఎమ్మెల్యే అభినందించారు.
మోపాల్ మండలంలోని ఠాణాకుర్డు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఏర్పాటుచేసిన ఈత వన మహోత్సవంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వనమాహోత్సవంను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచం పర్యావరణ సమస్య ఎదుర్కొంటుందని, భూతాపం పెరిగి వాతావరణంలో సమస్యల లోపిస్తుందని, ఇటువంటి సమస్య రాకుండా ప్రతి కుటుంబం 6 మొక్కలు నాటాలని, సంరక్షించి భావితరాలకు అందించాలని ఆయన అన్నారు. గ్రామంలో ఇల్లు లేని పేదలకు, అర్హత ఉన్నవారికి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి కట్టిబడి ఉన్నానని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ముప్పగంగారెడ్డి,పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, ఎన్ డి సి సి బి వైస్ చైర్మన్ నల్ల శేఖర్ రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ రాపల్లి రవీందర్ రమేష్ రెడ్డి,ఏ డి ఈ బాలేష్ కుమార్, ఎక్సైజ్ ఈ ఎస్ మల్లారెడ్డి, సిఐ సుస్మిత,ఎస్సై మల్లేష్, మండల అధ్యక్షులు ఎల్లోల సాయ రెడ్డి, గిరిజన కాంగ్రెస్ చైర్మన్ కేతావత్ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూర్య రెడ్డి, గంగ ప్రసాద్, అరికెల రాజారెడ్డి, జలంధర్ రెడ్డి,లింగన్న ప్రవీణ్ అధికారులు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >