Posted on 2025-07-15 20:10:02
వైస్ చాన్సలర్ టి.యాదగిరి రావు వెల్లడి
భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన సిపి సాయి చైతన్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగే 2వ స్నాతకోత్సవ ఏర్పాట్లును యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టి. యాదగిరి రావు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. స్నాతకోత్సవం కోసం ఏర్పాట్లు పూర్తి అయినట్లు విసి తెలిపారు. భద్రత ఏర్పాట్లను కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. స్నాతకోత్సవం జరిగే ప్రాంగణంలో స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం, బాంబు డిస్పోజల్ టీం అధికారులు నిశితంగా పరిశీలించారు. ఏర్పాట్లలో భాగంగా డిచ్ పల్లి 7వ బెటాలియన్ గాడ్ ఆఫ్ హోనర్ బృందం, బ్యాండ్ టీం, ఆర్ ఎస్ ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్.టి యాదగిరిరావు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య లకు గౌరవ వందనం సమర్పించినారు. వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎం. యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ కె.సంపత్ కుమార్, డీన్స్ తో కలిపి మాక్ సెషన్ నిర్వహించారు. ఈరోజు జరిగిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో రిసెప్షన్ కమిటీ, డయాస్ కమిటీ, సీటింగ్ ఏర్పాటు కమిటీ, సెనేట్ కమిటీ, ప్రింటింగ్ కమిటీ, హాస్పిటాలిటి కమిటీ, ఎంట్రీ & రెగ్యులేషన్ కమిటీ, ప్రెస్ మీడియా కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ, డిస్ట్రిబ్యూషన్ కమిటీ, డిసిప్లిన్ కమిటీ, గోల్డ్ మెడల్స్ నిర్వహణ కమిటీ, క్యాంపస్ రిజర్వేషన్ కమిటీ కన్వీనర్లు ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ అపర్ల, ప్రొఫెసర్ హారతి, ప్రొఫెసర్ రాంబాబు, ప్రొఫెసర్ ఆంజనేయులు, ప్రొఫెసర్ కి రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ప్రొఫెసర్ నాగరాజు, డా.ఏ పున్నయ్య లతో పాటు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >