| Daily భారత్
Logo




నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం

News

Posted on 2025-07-15 21:47:28

Share: Share


నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం

తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాటుకు అందరు సహకరించి భాగస్వాములు కావాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శాంతి భద్రతల  పరిరక్షణ మరియు సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య  ఐపీఎస్,ఆదేశాల మేరకు నిజామాబాదు అడిషనల్ డీసీపీ(అడ్మిన్) బసవ రెడ్డి , ఉత్తర్వుల ప్రకారం ఏసీపీ నిజామాబాదు రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణ లో నార్త్ రూరల్ సర్కిల్   ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఐదవ టౌన్ ఎస్సై గంగాధర్  ఆధ్వర్యంలో  పోలీస్ అధికారులు, సిబ్బందితో 110 పోలీస్ సిబ్బందితో కలిసి శాంతినగర్, హస్మి కాలనీ, ముజాయిద్ నగర్ కాలనీ ప్రాంతం లో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి  ఇళ్లను సోదాలు చేశారు. తనిఖీలలో 62 ద్విచక్ర వాహనాలను, 13 ఆటోలు, ఒక కార్ లను సిజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం  నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి  ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని  ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

కాలనీలలో  ప్రజలందరి భాగస్వామ్యంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సీసీ కెమెరాలు ఉన్నచోట ఎలాంటి నేరం చేయడానికి అయినా భయపడతారని, సీసీ కెమెరాలు 24 గంటలు నిరంతరం రక్షణగా ఉంటాయని తెలిపారు. నేరా నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని కావున ప్రజలందరూ సహకరించి సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. ప్రతిదీ సీసీ కెమెరా లో నిక్షిప్తమై ఉండడం వలన ఏదైనా నేరం జరిగినప్పుడు నిజా నిజాలను గుర్తించడానికి మరియు నిందితులను గుర్తించడం సులభం అవుతుందని అన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇల్లు అద్దెకొరకు మీ దగ్గరకు వస్తే వారి పూర్తి వివరాలు అడిగి వారి వద్ద నుండి ఆధార్ కార్డ్ తీసుకోవాలి ఏమైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజల రక్షణ, ప్రజలకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు అనే భరోసా నమ్మకం కలిగించే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం లో  భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే  పోలీస్ లేదా డయల్ 100 కు గాని స్థానిక పోలీస్ అధికారులకు ఫోన్ చేసిన  వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు.

Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >