Posted on 2025-07-17 16:41:18
డైలీ భారత్, మెదక్: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి పెను ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ముందు వెళ్తున్న ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో 4 కార్లు ఒకదానికొకటి ఢీ కొట్టాయని, దీంతో కార్ల ముందు భాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ప్రమాదానికి ముందు ఆయన నర్సాపూర్‌లో పర్యటించారు. అర్హులందరికీ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రేషన్ కార్డులను మంత్రి వివేక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మహిళ ఆర్థికంగా నిలబడితేనే కుటుంబం బాగుంటుందన్నారు. అలాగే, విద్యాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటన అనంతరం ఆయన తిరుగు ప్రయాణం చేస్తుండగా తన కాన్వాయ్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది..
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >