Posted on 2025-07-17 19:00:56
ఇక ఎన్నికల కోడ్ కూసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజల ఆందోళన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నేరుగా ప్రశాంత్ రెడ్డి ఇంటి పై దాడి చేసేంతవరకు చేరుకున్నాయి ఇందూరు రాజకీయాలు. గత రెండు రోజుల క్రితం ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధితులకు సంక్షేమ నిధి అలాగే గల్ఫ్ లో ఇబ్బంది పడుతున్న మన కార్మికులకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సహాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ మాటలను గల్ఫ్ బాధితుల సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలం చెందారని ప్రశాంత్ రెడ్డి విమర్శించడంతో దీనికి స్పందించిన డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని ఎవరు ప్రజలకు మేలు చేస్తున్నారు ఆ సవాల్లోనే చర్చి చర్చించుకుందాం అని ప్రతిస్పందించడంతో చెలరేగిన రాజకీయమంటలు ఒక్కసారిగా చిల్లరీగాయి అధికారం కోల్పోయిన టిఆర్ఎస్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అధికారం లేకపోవడంతో అబద్ధాలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మానాల మోహన్ రెడ్డి గురువారం పత్రిక సమావేశం ఏర్పాటు చేసి అందులో తెలియజేశారు. అయితే ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో తెలియ చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ కనువిప్పు అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు నిజాలు తెలియజెప్పడానికి కాంగ్రెస్ శ్రేణులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఉదయం నుంచి పోలీసులు ఎక్కడికక్కడే కాంగ్రెస్ పార్టీ జిల్లా అగ్రనేతలను హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. అయితే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు గురువారం మధ్యాహ్నం వేల్పూర్ లోని ప్రశాంత్ రెడ్డి నివాసంలోకి చొరబడి దాడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో వేల్పూర్ లో పరిస్థితి తీవ్ర ఉధృతంగా మారింది. అయితే ఇంకా ఎన్నికలు రాకముందే ఓ వారం రోజుల్లో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు రాజకీయ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఏకంగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఇండ్లపై దాడికి దిగుతున్నారంటే ఇక వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే..
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >