| Daily భారత్
Logo




ఇండ్లపై దాడులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి

News

Posted on 2025-07-17 20:40:12

Share: Share


ఇండ్లపై దాడులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి

యథేచ్ఛగాకాంగ్రెస్ అరాచక పాలన

-కాంగ్రెస్ నాయకుల?,బజారు రౌడీలా?

మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడి రేవంత్ సర్కారు దాష్టీకాలకు నిదర్శనం

కేసీఆర్ కనుసైగ చేస్తే ఒక్క కాంగ్రెస్ నేత తిరగలేడు.

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అధికారం ఉంది కదా అని ప్రతిపక్ష నేతల ఇండ్లపై దాడులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి  జీవన్ రెడ్డి మండిపడ్డారు.

వేల్పూర్ లో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పథకం ప్రకారం చేసిన దాడి రేవంత్ సర్కారు దాష్టీకాలకు నిదర్శనం అని ఆయన గురువారం ఒక ప్రకటనలో ఖండించారు.రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, విపక్ష నేతలు చేసే విమర్శలకు ప్రజాస్వామ్య బద్దంగా సమాధానం చెప్పలే కానీ ఇండ్లపై దాడులు చేసి హింసకు పాల్పడటం ఏమిటని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే నేరమా అని ఆయన నిలదీశారు. గల్ఫ్ కార్మికుల విషయంలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ,రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, ఎన్ ఆర్ ఐ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల టోల్ ఫ్రీ నెంబర్ లాంటి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయని విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేయడం ఎలా తప్పవుతుందన్నారు.ఈ మాత్రం దానికే దాడులకు పాల్పడటం సిగ్గు చేటు అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎవరి  ఇంటి మీదనైనా దాడులు చేసేమా, మీలాగా మేము హింసకు పాల్పడి ఉంటే అసలు కాంగ్రెస్ మిగిలేదా అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇలాంటి దాడులు సభ్యత కాదని, రాజకీయాల్లో ఇది మంచిది కాదని ఆయన హితవుపలికారు. 

యథేచ్ఛగాకాంగ్రెస్ అరాచక పాలన సాగుతోందని ఆయన పేర్కొంటాయి 

కాంగ్రెస్ నాయకులా?,బజారు రౌడీలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ కనుసైగ చేస్తే ఒక్క కాంగ్రెస్ నేత తిరగలేడని,కాంగ్రెస్ ఆగడాలను అడ్డుకుంటామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >