| Daily భారత్
Logo




క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర సైబర్ నిందుతుడు అరెస్ట్

News

Posted on 2025-07-19 18:08:33

Share: Share


క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర సైబర్ నిందుతుడు అరెస్ట్

క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరుతో వాట్సప్ కి APK లింక్ షేర్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర సైబర్ నిందుతుడు అరెస్ట్.

RAPIDO కొరియర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల నుండి  మొబైల్ ఫోన్స్,సిమ్ కార్డ్స్ సేకరణ,మోసాల అంతరం తిరిగి కొరియర్ ద్వారా పంపడం.

 నిందుతులకు గుర్తుతేలియని వ్యక్తుల నుండి రాపిడో ద్వారా ప్రతి లక్ష రూపాయలకు 2500 రూపాయల కమిషన్.

దేశవ్యాప్తంగా NCRP పోర్టల్ నందు 60 ఫిర్యాదులు , సుమారు 50 లక్షల రూపాయల మోసాలు..

ఒక కారు,06 మొబైల్ ఫోన్స్ స్వాధీనం.

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.,

సైబర్ నిందుతున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సైబర్ టీమ్,సిరిసిల్ల పట్టణ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: హైదరాబాద్ లోని చింతల్,వెంకటరామిరెడ్డి నగర్ కు చెందిన మొహమ్మద్ కలీం పాషా, తండ్రి: బాబుజానీ అనునతడు తనకు పరిచయం ఉన్న హైదరాబాద్ కు చెందిన రషీద్ ఇద్దరు కూడా చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి ఎలాగయినా తక్కువ సమయములో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యముతో ఆన్లైన్ ద్వారా ప్రజలను సులువుగా మోసగించి డబ్బులు సంపాదించ వచ్చునే నిర్ణయించుకుని,రషీద్ కి పరిచయం ఉన్న అంకిత్ అనే వ్యక్తి వద్దకు 2025 సంవత్సరములోని ఫిబ్రవరి నెలలో ఇద్దరు కలసి కలకత్తాకు వెళ్లి ఆన్లైన్ ద్వారా ప్రజలను ఎలా మోసాగించాలో అడుగగా అంకిత్ వారికి RBL క్రెడిట్ కార్డు కొరకు దరకాస్తు చేసుకొని కార్డు వచ్చిన తరువాత activation కొరకు చూస్తుంటారో వారి యొక్క పేర్లు, ఫోన్ నంబర్స్, క్రెడిట్ కార్డు నంబర్స్ మరియు పాన్ కార్డ్ నెంబర్ లను అంకిత్ వారిద్దరికీ whatsapp ద్వారా పంపిస్తానని,వాటితో క్రెడిట్ కార్డు కొరకు దరకాస్తు చేసుకొన్న వారితో క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ లాగా వీరిద్దరూ మాట్లాడి వారిని నమ్మించి మోసాలకు పాల్పడే వారు అందులో భాగంగా క్రెడిట్ కార్డ్ activation కొరకు బాధితులతో మాట్లాడి వారికి  అంకిత్ పంపిన Apk/links ను పంపితే అట్టి Apk/links ను క్లిక్ చేసినా లేదా ఇన్స్టాల్ చేసుకున్నా వారి ఫోన్ hack అయ్యిన తదుపరి క్షనాలలో అంకిత్ వారి క్రెడిట్ కార్డులలో ఉన్న డబ్బులను e-కామర్స్ ద్వారా కొనుగోళ్ళు జరిపి డబ్బులన్నీ కాజేసేవాడు.

అంకిత్ చెపినట్లు  మహమ్మద్ కలిమ్, రసిద్ చేసినందుకు ప్రతి లక్ష రూపాయలకు 2,500/- చొప్పున RAPIDO  కొరియర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వీరిద్దరికీ డబ్బులు పంపించేవారు. 

అంకిత్ కేవలం వీరితో whatsapp ద్వారా మాత్రమె  మాట్లాడుతూ క్రెడిట్ కార్డు దారుల వివరాలను పంపుతూ, వీరిద్దరూ ఉపయోగించడానికి RAPIDO కొరియర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా Mobile phones మరియు SIM కార్డులను ప్రతి 10 రోజులకు ఒకసారి పంపుతూ, పాత Mobile phones మరియు SIM కార్డులను తిరిగి  RAPIDO  కొరియర్ ద్వారా వెనక్కి తీసుకునే వాడు.

ఈక్రమంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తి వీరి చేతిలో మోసపోగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా సిరిసిల్ల పట్టణ పోలీసులు జిల్లా సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, గంగరెడ్డి, కిట్టు, మహేష్ ఆధ్వర్యంలో టీమ్ ఏర్పటు చేసి సాంకేతికత ఆధారంగా ఈ రోజు హైదరాబాద్ లో పట్టుకోవడం జరిగిందని మిగితా ఇద్దరు నిందితులను త్వరలో పట్టుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

అరెస్టు చేయబడిన నిందితుడి వివరములు:

1.Mohammad Kaleem Pasha s/o Mohammad Babu Jani, 32 years, Muslim, occ: Private job, r/o H.No 26-99, Venkatramireddy Nagar, Near Community hall, Chintal, Hyderabad,

పరారిలో ఉన్న నిందితుని వివరములు:

1.Ankith r/o Kolkata of West Bengal state,

2.రషీద్ r/o Hyderabad.

అంతర్ రాష్ట్ర సైబర్ నిందుతున్ని పట్టుకోవడంలో కృషి చేసిన సైబర్ ఆర్.ఎస్.ఐ జునైద్, సైబర్ టీమ్ గంగరెడ్డి,కిట్టు, మహేష్,శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ లను ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >