Posted on 2025-07-19 21:38:06
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్పల్లి మండలం ధర్మారం(బీ ) గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక బోధనఅందిస్తూ, మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా అంకిత భావంతో కృషి చేయాలని పాఠశాల నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు.
అంతకుముందు ఆఫీస్ రూంలో పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ లతో సమావేశమై, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ಅನಿ తెలుసుకున్నారు. పర్యవేక్షణ అధికారి ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ಅಜಿಗಿ పాఠశాల నిర్వహణను పక్కాగా పర్యవేక్షించాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ ప్రకారం ప్రతిరోజూ ఉడకబెట్టిన కోడిగుడ్లు అందిస్తున్నారా, టెండర్ ప్రక్రియ పూర్తయిందా అని ఆరా తీశారు. భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. సిబ్బంది అటెండెన్స్, ఇతర రికార్డులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల రోజువారీ దినచర్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్.సీ.ఓ సత్యనాథ్ డిచ్పల్లి తహసీల్దార్ సతీష్ రెడ్డి తదితరులు న్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >