| Daily భారత్
Logo




వీడిన చందునాయక్‌ హత్య కేసు మిస్టరీ.. ఐదుగురు నిందితుల అరెస్ట్‌

News

Posted on 2025-07-20 09:09:47

Share: Share


వీడిన చందునాయక్‌ హత్య కేసు మిస్టరీ.. ఐదుగురు నిందితుల అరెస్ట్‌

ఆర్థిక, వివాహేతర సంబంధంతోనే హత్య.

రివాల్వర్‌, కారు స్వాధీనం వివరాలు వెల్లడించిన

సౌత్‌ఈస్ట్‌ జోన్‌ డీపీపీ చైతన్యకుమార్‌

డైలీ భారత్, సైదాబాద్‌ : పట్టపగలు గన్‌తో సీపీఐ నాయకుడు కేతావత్‌ చందునాయక్‌ను కాల్చి చంపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హయత్‌నగర్‌ మండలం కుంట్లూర్‌ వద్ద వేసిన 13 వందల మంది గుడిసెవాసుల వద్ద వసూలు చేసిన నగదు, బిల్డిర్‌ వద్ద నుంచి వసూలు చేసిన నగదు పంపకాల్లో వచ్చిన విభేదాలే హత్యకు దారి తీసింది.

ఆర్థిక, వివాహేతర సంబంధం అనుమానంతోనే చందు నాయక్‌ను రాజన్న అతడి అనుచరులు ఒక మూఠాగా ఏర్పడి హత్య చేశారని సౌత్‌ఈస్ట్‌ జోన్‌ డీపీపీ చైతన్యకుమార్‌ వెల్లడించారు. శనివారం సాయంత్రం సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్‌ఈస్ట్‌ జోన్‌ అదనపు డీసీపీ శ్రీకాంత్‌, టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ అందే శ్రీనివాస్‌, మలక్‌పేట, సైదాబాద్‌ డివిజన్ల ఏసీపీలు సుబ్బరామిరెడ్డి, సోమ వెంకట్‌ రెడ్డిలతో కలిసి వెల్లడించారు.

చైతన్యపురిలో నివసించే కేతావత్‌ చందు నాయక్‌ (48) సీపీఐ స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 15న మలక్‌పేట్‌ మూసారాంబాగ్‌ డివిజన్‌ పరిధిలోని శాలివాహన నగర్‌ పార్క్‌ వద్ద వాకింగ్‌ చేసి బయటకు వస్తున్న అతడిపై దొంతి రాజేశ్‌, అలియాస్‌ రాజన్న తన అనుచరులతో కలిసి రివాల్వర్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు.

తొమ్మిది మంది ఒక ముఠాగా ఏర్పడి చందు నాయక్‌ కంట్లో కారం పోసి హత్య చేశారు. ప్రధాన నిందితుడు రాజన్నతో పాటు ఏడుకొండలు, అర్జున్‌ జ్ఞానప్రకాశ్‌, లింగిబేడి రాంబాబు, ప్రశాంత్‌, శ్రీను అలియాస్‌ నాగరాజును అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి పిస్టల్‌, రివాల్వర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌, డీఐ జయశంకర్‌, సైదాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రమోహన్‌, ఆనంద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >