Posted on 2025-07-20 18:31:06
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్; తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని ధర్నా చౌక్ నుండి గాంధీ చౌక్ మీదుగా ధర్నా చౌక్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్,బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీచర్స్, లెక్చరర్స్, ఎంఈఓ, డిఇఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను అమలు చేయాలన్నారు. గురుకులాలకు, ఎస్ఎంఎస్ హాస్టల్లకి సొంత భవనాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆ సందర్భంగా ఈ నెల 23న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు జూనియర్ ప్రభుత్వ కళాశాల బందుకు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఏఐపీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్, ఏఐఎస్టీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు అనుముల సతీష్, ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్,నగర అధ్యక్షులు అజాద్, అబి, గణేష్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు అశుర్ జిల్లా నాయకులు వినోద్, సృజన్,మనోజ్, గబ్బర్ సింగ్, రమేష్, ఏఐపీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, నాయకులు గణేష్ సింగ్, యశ్వంత్, సూర్య పాల్, ఏఐఎస్టీఎస్ నీరజ్,మధు, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >