| Daily భారత్
Logo




రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్న తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా

News

Posted on 2025-07-21 20:22:24

Share: Share


రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్న తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈనెల 22, 23 తేదీల్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా జిల్లాలో పర్యటించనున్నట్లు డీఈఓ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులందరూ ఈ రెండురోజులలో సెలవు వినియోగించుకోకుండా పాఠశాలకు హాజరు కావాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుని వద్ద పాఠ్యప్రణాళికలు, డైరీలు ఉండాలని సూచించారు. టైంటేబుల్, పాఠశాల నిర్వహణా కమిటీలు, వివిధ కమిటీలు ప్రదర్శించాలని అన్నారు. లైబ్రరీల నిర్వహణ లైబ్రరీ గదులు వాటికే వినియోగించాలని తెలిపారు. టీచర్ ట్రైనింగ్ లో చెప్పిన విధంగా పాఠ్యాంశ బోధన జరగాలని, బడిబాట వివరాలను ఎన్రోల్ మెంట్ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గత సంవత్సరం బడిబాట ఎన్రోల్ మెంటు అందుబాటులో ఉంచాలి. బడిబాటకు సంబంధించిన డాక్యుమెంటును ప్రదర్శించాలని సూచించారు. అలాగే మధ్యాహ్నభోజన రికార్డులు,వివరాలు ఉన్నతీకరించి అందుబాటులో ఉంచాలన్నారు. పాఠశాలలో జరిగిన విశేషాలను డాక్యుమెంటు రూపంలో ప్రదర్శించగలగాలన్నారు.

గతసంవత్సరం విద్యార్థులకు ప్రత్యేకంగా వినియోగించిన నోట్ బుక్స్ ని ప్రదర్శించేందుకు అందుబాటులో ఉంచాలి. సైన్స్ ల్యాబ్ లో చేసిన యాక్టివిటీ వివరాలు అందుబాటులో ఉండాలి. ల్యాబ్ లు నీట్ గా ఉండాలి. టెక్స్ట్ బుక్స్, యూనిఫాం, డాటాను ఆన్ లైన్ 100 శాతం పూర్తి చేయాలి. పెరిగిన ఎన్ రోల్ మెంటు ప్రకారం పాఠ్యపుస్తకాలు లేకపోతే తగ్గినవారికి పాత పుస్తకాలు అందించాలి. యుడైస్ డాటా 100 శాతం పూర్తి చేయాలి. ఉపాధ్యయులంతా పాజిటివ్ దృక్పధంతో ఉండి విద్యార్థులు వారి సామర్థ్యాలను కార్యదర్శి ముందు ప్రదర్శించగలిగేలా తర్ఫీదునివ్వాలన్నారు. భవిత కేంద్రాలను, యం.ఆర్,సిలను సందర్శిస్తారు గనుక ఐ.ఇ.ర్.పిలు, యం.ఆర్.సి స్టాప్ సిద్ధంగా ఉండాలన్నారు. సి.ఆర్.పిలు కాంప్లెక్సు వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా  పర్యటనను విజయవంతం అయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.

జిల్లాతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రాణాకు ప్రత్యేక అనుబంధం


గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన యోగితా రాణా తాను ఇక్కడ విధులు నిర్వహించినన్ని రోజులు నిక్కచ్చిగా తప్పులు తప్పుదాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసిన అనుభవం ఆమెకు ఉంది. ప్రజావాణిలో సైతం జిల్లాలోని ఆయా శాఖల అధికారులు గైర్హాజరైతే వారికి తమడైన శైలిలో వారి తప్పులు పునరావృతం కాకుండా హెచ్చరించే వారు. మొత్తానికి స్ట్రిక్ట్ అధికారిగా  ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి జిల్లా అభివృద్ధిలో అధికారులను పరిగెత్తించేవారు. ఇదంతా నానానికి ఒకవైపు ఉంటే అనాధ విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పించే విధంగా మానవతా సదన్ ను ఏర్పరిచి వారంలో ఒక్కసారైనా అటువైపు పర్యటనకు వెళ్ళినప్పుడు మానవతా సదన్ కు వెళ్లి ఆ అనాధ పిల్లలను పలకరించి వారితో కలిసి  వారికి కావాల్సిన వసతులను సమకూర్చేవారు అప్పటి జిల్లా కలెక్టర్ యోగితా రాణా ప్రస్తుత ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి. రెండు రోజులపాటు జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో మానవతా సదన్కు వెళ్ళనున్నారా అనే సందేహం నెలకొంది.

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >