Posted on 2025-07-23 10:52:44
ఆసుపత్రిలో ఉన్న ఓ లిఫ్టు ఒక్కసారిగా ఆగిపోవడంతో అందులో ఉన్న రోగులు, వారి బంధువులు ఆందోళన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సమస్యలు, సరిగా లేక ఇక్కడికి వైద్యం కోసం వచ్చిన వారు నానా నరకయాతన పడుతున్నారు. వైద్యం సంగతి అటు ఉంచితే ఆసుపత్రిలో ఉన్న లిఫ్టులు ఎప్పుడు పనిచేస్తాయో ఎప్పుడు పనిచేయవో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సుమారు అరగంట పాటు రోగులు వారి బంధువులు లిఫ్టు ఒక్కసారి ఆగిపోవడంతో ఆ లిఫ్టు డోరు తెరుచుకోకపోవడంతో గాల్లో ఊపిరి పోయినట్టుగా రోగులు వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పైవార్డులో నుంచి రోగులు మరియు వారి సహచరులు లిఫ్ట్ కిందకు వెళ్తున్న సమయంలో, ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోయి డోర్ తెరుచుకోలేదు అందులో ఇరుక్కుపోయిన వారు అరగంట పాటు గాల్లో ఊపిరి తీసుకునే పరిస్థితి లేక బిక్కుబిక్కుమన్నారు. సమాచారం అందుకున్న సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చి, వారు వెంటనే అక్కడకు చేరుకొని లిఫ్ట్ డోర్ను తెరిచి రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటనపై రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి లిఫ్ట్ల పరిస్థితిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకున్న పరిస్థితి ఉండేది. లిఫ్ట్ ల మెంటైనెన్స్ కోసం నెల నెల ప్రభుత్వం నుండి డబ్బులు మంజూరు అవుతున్నప్పటికీ వాటిని మెంటేనెన్స్ చేయడంలో ఆసుపత్రి అధికారులు విఫలమైతున్నారు. ఒకవేళ అత్యవసర ప్రమాద బాధితులు ఎవరైనా చికిత్స కోసం లిఫ్టులో పోతే ఇలా అర్ధాంతరంగా ఒక్కసారిగా ఆగిపోవడంతో వారి ప్రాణాలు లిఫ్టులోనే గాల్లో కలిసిపోవాల్సిందేనా అని, దీనికి బాధ్యులు ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >