| Daily భారత్
Logo




మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న డ్రైనేజ్ డ్రైవ్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన

News

Posted on 2025-07-24 17:42:44

Share: Share


మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న డ్రైనేజ్ డ్రైవ్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గల్లి గల్లి వాడ వాడలో డ్రైనేజ్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతం గా కొనసాగుతున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది నగరంలో పేరుకుపోయిన చెత్తాచెదరాన్ని తొలగిస్తూ శుభ్రతను పాటించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలోనే గ్రామాలతో పాటు మున్సిపల్ కార్యాలయం అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి శుభ్రత పాటించాలని ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే. దీంతో నగరం లోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది చెత్తాచెదరని తొలగించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని చెత్తాచెదరం, తో పాటు  ఫాగింగ్ కార్యక్రమం  ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా చెత్తాచెదరని తొలగించేందుకు ప్రభుత్వపరంగా ఏర్పాటుచేసిన వాహనంలో నగర ప్రజలు సద్వానియోగం చేసుకోవాలని ప్రజలను సంబంధిత అధికారులు సిబ్బంది కోరారు. నగరంలో ఏ ఒక్కరు కూడా అనారోగ్యానికి గురికాకుండా  ఉండేందుకు లక్ష్యంగా పనిచేస్తున్నామని వారు తెలియజేస్తున్నారు. నగరంలోని మురికి కాలువలు చెత్తాచెదరంతో కూరుకుపోకుండా   దృష్టి సారించినందుకు గల్లి గల్లి వాడ వాడలోని ప్రజలు మున్సిపల్ సిబ్బంది పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తూ జై జై లు పలుతున్నారు. అదేవిధంగా నగరంలోని ఎక్కడైనా చెత్తాచెదరంతో పాటు మురికి కి కాలువల సమస్య తలెత్తిన మరుక్షణమే మున్సిపల్ అధికారులకు సిబ్బంది దృష్టికి తీసుకువచ్చే విధంగా సహకరించాలని వారు కోరుతున్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే తక్షణమే మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి క్లీన్ నగరం తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వారు అన్నారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >