| Daily భారత్
Logo




పహల్గామ్‌‌ ఉగ్రవాదులను హతమార్చిన ఇండియన్ ఆర్మీ

News

Posted on 2025-07-28 12:35:45

Share: Share


పహల్గామ్‌‌ ఉగ్రవాదులను హతమార్చిన ఇండియన్ ఆర్మీ

డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్: పహల్గామ్‌లో మారణహోమం సృష్టించిన ముష్కరులు హతమయ్యారు. సైన్యం చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు కుక్కచావు చచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సైన్యం అధికారికంగా ధృవీకరించినట్లు ఆలిండియా రేడియో వైబ్‌సైట్‌లో పేర్కొంది.

జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి భారత భద్రతా బలగాలు ధీటైన సమాధానం ఇచ్చాయి. అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ సూటిగా లక్ష్యంగా చేసుకొని హతమార్చింది.

ఆపరేషన్ మహదేవ్ – ఉగ్రవాదులపై కౌంటర్ దాడి

శ్రీనగర్‌లోని హర్వాన్–లద్వాస్ ప్రాంతాల్లో జూలై 28న ఉదయం 11 గంటల సమయంలో భారత ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహదేవ్ (Operation Mahadev) లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. స్థానిక గిరిజనుల సమాచారం ఆధారంగా ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించగా తీవ్రవాదులతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.

ఎన్కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు TRF (The Resistance Front) కు చెందినవారు. హతమైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా వీరి ఒక్కొక్కరిపై రూ. 20 లక్షల వరకు బహుమతి ప్రకటించబడి ఉంది. ఆపరేషన్‌లో ఇద్దరు తీవ్రవాదులు గాయపడ్డట్టు సమాచారం.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్  ఉగ్రదాడిలో మొత్తం 26 మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. ఈ అమానవీయ దాడికి నిందితులుగా ఉన్న TRF సభ్యులను హతమార్చడం భద్రతా పరంగా భారతదేశానికి కీలక విజయంగా భావిస్తున్నారు. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో లోక్‌సభలో "ఆపరేషన్ సింధూర్" పై చర్చ సాగుతుండడం గమనార్హం. ఇదే తరుణంలో భారత భద్రతా బలగాలు పహల్గామ్ దాడిలో పాల్గొన్న తీవ్రవాదులపై కౌంటర్ దాడి జరిపిన విధానం భారత రక్షణ విధానంలో మార్పును చాటుతోంది.

శ్రీనగర్‌లో హై అలర్ట్, అప్రమత్తమైన బలగాలు

ఈ ఎన్‌కౌంటర్ అనంతరం శ్రీనగర్‌ సహా సమీప ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. భద్రతా బలగాలు నాన్ స్టాప్ పర్యవేక్షణ చేపట్టాయి

జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలోని హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని... ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొంది. ఆ ప్రాంతానికి మరిన్ని భద్రతా బలగాలను పంపిస్తున్నారు.

అయితే ప్రాథమిక నివేదికల ప్రకారం... ఆపరేషన్ మహాదేవ్‌లో మరణించిన ఉగ్రవాదులలో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ షా అకా హషీమ్ ముసా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >