Posted on 2025-07-30 17:29:13
కొన్ని నెలలుగా ఈ దందా సాగుతున్నట్లు స్థానికుల వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసిపి నాగేంద్రచారి సార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సైలు గోవింద్, శివరాం మరియు సిబ్బంది టౌన్-5 నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం 80 క్వాటర్స్ లో వ్యభిచార గృహం పై రైడ్ చేసి ఇద్దరు ఆర్గనైజర్లు, ఇద్దరు విటులు, ఐదుగురు విటురాల్లు, 9 సెల్ ఫోన్స్, 93,250 రూపాయల నగదు తో పాటు రెండు కండోమ్ ప్యాకెట్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం అయిదవ పోలీస్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు. అయితే ఇదే నాగారం ప్రాంతంలో 80 క్వార్టర్స్ లో ఈ వ్యభిచార ముఠా గత కొన్ని నెలలుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు స్థానికుల అందిస్తున్న సమాచారం మేరకు తెలిసింది. అస్సి క్వార్టర్స్ గా పిలువబడే ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం నగరంలో ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్ ల మాదిరిగా నాణ్యత లేకుండా నిర్మించి ఎవరికి ఇవ్వకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఆ ప్రాంతవాసులు అందులో కొంతమంది ఇందులేని వారు నివాసముండగా మరికొందరు మైనారిటీకి చెందిన ఓ బడా నేత ఈ వ్యభిచారంట నడిపిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తుంది. స్థానికుల కథనం ప్రకారం ఐదవ టౌన్ నుండి అస్సి క్వార్టర్స్ లో ఉన్న ఈ అపార్ట్మెంట్ వరకు సదరు ఈ వ్యభిచార దందా నడిపించే వ్యక్తి తన మనుషులను ఐదవ పోలీస్ స్టేషన్ నుండి మూడు ప్రాంతాల్లో నిత్యం నిఘా ఉంచుతూ ఎవరైనా ఆ ప్రాంతం గుండా కొత్తవారు గాని కొత్త వాహనాలు గాని అటువైపుగా వస్తే వెంటనే సదరు వ్యక్తికి ఫోన్ చేసి మరి సమాచారం అందిస్తారు. వెంటనే ఆ ముఠా కు చెందిన బడా వ్యక్తి అప్రమత్తం అయ్యి ఆ ప్రాంతమంతా ఖాళీ చేయించే వారిని స్థానికుల ద్వారా సమాచారం అందుతుంది.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >