| Daily భారత్
Logo




బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు తోడుదొంగలు

News

Posted on 2025-07-30 17:30:34

Share: Share


బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు తోడుదొంగలు

బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బి ఆర్ ఎస్

30 లక్షలతో సొసైటీ  గోదాం  నిర్మాణానికి భూమి పూజా చేసిన రూరల్ ఎమ్మెల్యే  భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గత పార్లమెంట్ ఎన్నికల్లో  బిఆర్ఎస్, బిజెపి  కలిసి పనిచేశాయని, అందుకే టిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని, బిజెపి, బిఆర్ఎస్ తోడు దొంగలని  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి విమర్శించారు. ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో రామడుగు ప్రాథమిక సహకార సంఘం  ఆధ్వర్యంలో  30 లక్షల నిధులతో  గోదాం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, తెలంగాణ లో ఉన్న బిఆర్ఎస్ పార్టీలు  రెండు తోడు దొంగలని అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి  రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీల గురించి మాట్లాడని ఎమ్మెల్సీ కవిత.. నేడు బీసీ నిదానం ఎత్తుకుంటే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కాంగ్రెస్‌ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించిందని, బీజేపీ ఎమ్మెల్యేలు బిల్లుకు మద్దతు ఇచ్చి పార్లమెంట్‌లో ఎంపీలు మాట మార్చారని విమర్శించారు. 

కాంగ్రెస్‌ ఆలోచన విధానాన్ని గమనించాలని అన్నారు

గత ప్రభుత్వం 10 ఏళ్లలో  ఏ ఒక్కరికి రేషన్‌కార్డు ఇవ్వలేదని, 18 నెలల్లోనే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్‌కార్డులతోపాటు అనేక పథకాలు అమలుచేస్తుందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఆలోచనా విధానాన్ని ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం  పేదోడి ప్రభుత్వమని తెలిపారు. సన్నబియ్యం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.3వేల కోట్ల భారం పడుతుందన్నారు. మోదీ ప్రభుత్వమే సన్నబియ్యం ఇస్తుందని బీజేపీ వారు చెప్పుకుంటున్నారని, వారు 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారని, అక్కడ ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పాలని పేర్కొన్నారు. సమావేశంలో  సొసైటీ చైర్మన్ రాజేందర్, సొసైటీ డైరెక్టర్లు శంకర్, మైపాల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్న బాల్ రాజ్, అమృత పూర్ గంగాధర్ డిచ్పల్లి సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్, సీనియర్ నాయకులు  మునిపల్లి  సాయిరెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి, గంగాధర్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేష్, గ్రామ శాఖ అధ్యక్షులు మధు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >