Posted on 2025-07-31 21:33:39
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న సాయి ఎక్సలెంట్ స్కూల్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నవోదయ ఎంట్రెన్స్ పరీక్షకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్కూలు నవోదయ శిక్షణ ఇంచార్జ్ ఎస్. అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025-2026 విద్య సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయి ఎక్సలెంట్ స్కూల్లో శిక్షణ ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. గతంలో సాయి ఎక్స్ లెంట్ స్కూల్ శిక్షణ ద్వారా 2024-2025 విద్యా సంవత్సరంలో ఆరుగురు విద్యార్థులు నవోదయ సీటు సాధించడం జరిగిందని, ఇంకా సీట్లు సాధించేందుకు అదే స్ఫూర్తితో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులను నవోదయ పాఠశాలలకు పంపి ఎన్నో విజయాలు సాధించామని అన్నారు. నవోదయలో ఆరవ తరగతి పరీక్షల ప్రవేశానికై పరీక్షలో పాల్గొనే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆన్లైన్ దరఖాస్తు ఆఖరి తేదీ : 13-08-2025 అని 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. నవోదయ ఎంట్రన్స్ పరీక్ష తేదీ :13-12-2025 న ఉంటుందని తెలిపారు. ది:02-08-2025వ తేదీ నుంచి విద్యార్థులకు సాయి ఎక్స్ లెంట్ స్కూల్లో నవోదయ శిక్షణ క్లాసులు ప్రారంభమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన వారికి కార్పొరేట్ స్థాయిలో విద్య ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం సాయి ఎక్సలెంట్ స్కూల్ 9441700094, 9440296832 కు కాల్ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు అన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >