| Daily భారత్
Logo




విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల వార్షికోత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి

News

Posted on 2023-12-24 18:40:09

Share: Share


విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల వార్షికోత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి

విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల పాలకవర్గ సభ్యుల ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథి గా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల పాలకవర్గ సభ్యుల ప్రధమ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరైన పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మరియు వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ...

ప్రాచీన కాలం నుండి నవీన కాలం వరకు సమాజ అభివృద్ధిలో విశ్వకర్మల కృషి ఎనలేనిది అన్నారు.  

విశ్వకర్మలు ఎంతో నైపుణ్యంతో చక్కని కళాకృతులతో వస్తువులను తయారు చేస్తూ నేడు ప్రతి ఇంటి నిర్మాణం లోను పాలుపంచుకుంటూ అన్ని కులాల మతాల వర్గాల వారికి సేవలందిస్తూ ప్రతి ఒక్కరిలో సోదరా భావాన్ని కలగజేస్తున్న నిజమైన వాస్తు శిల్పులు అన్ని వర్గాల వారికి నిస్వార్థంగా సేవలు అందించే ఇంజనీర్ లు మన విశ్వకర్మలు అని అన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని చేతివృత్తుల కులాల వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక పెట్టుబడి సహాయాన్ని అందించి ఆయా కులాల ఆర్ధిక అభివృద్ధికి కృషి చేశారు అందులో భాగంగా సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు మన ప్రాంతంలోని అర్హులైన వారికి ప్రభుత్వం నుండి అందాల్సిన ప్రోత్సాహకాన్ని పారదర్శకంగా నిజమైన అర్హులకు అందేలా చేయడంలో విశేష కృషి చేశారు అన్నారు ఇలా అన్ని కులాల వర్గాల వారు వారి కులవృత్తులను గౌరవిస్తూ నేటి ఆధునిక సమాజానికి తగినట్టుగా వారి వృత్తులలో సృజనాత్మకతను పెంపొందించేలా ఆధునికతను జోడించి వారి సేవలు మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు..

ఈరోజు విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల వారు వారిలోని ఐక్యతను తెలియజేస్తూ నూతన పాలకవర్గం యొక్క మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఈ సందర్భంగా 2024 సంవత్సరం యొక్క క్యాలెండర్ను ఈరోజు మా చేతుల మీదుగా విడుదల చేయడం మాకు చాలా సంతోషాన్ని కలిగించిందని ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు వారికి మా అభినందనలు తెలియజేస్తున్నామని  అన్నారు. 

విశ్వకర్మ వెల్ఫేర్ సొసైటీ వారు సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తూ సామాజిక కార్యక్రమాలను కూడా సిరిసిల్లలో చేస్తూ మిగతా సొసైటీలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు అదేవిధంగా విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల వారి అభివృద్ధికి గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎల్లవేళలా కృషి చేస్తారని ఆయన బాటలోనే మేము మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం కార్పెంటర్స్ వెల్ఫేర్ సొసైటీ సంఘ అభివృద్ధికి తమ చేతనైన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత విశ్వకర్మ పరిషత్ అధ్యక్షులు శ్రీరాములు వేణుగోపాల చారి, మండల అధ్యక్షులు శ్రీ సనుగుల రవీందర్, కార్పెంటర్ వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల అధ్యక్షులు రావోజు ప్రవీణ్, మొదలగు వారు మరియు విశ్వకర్మ కుల బాంధవులు పాల్గొన్నారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >