Posted on 2023-12-29 12:19:22
డైలీ భారత్, హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న"వ్యూహం" సినిమాకు మరో ఆటంకం ఎదురైంది.
ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ ను జనవరి 11 వరకూ సస్పెండ్ చేస్తూ తెలంగాణా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై విచారణను కూడా జనవరి 11కు వాయిదా వేసింది.
వ్యూహం సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సూరేపల్లి నంద గురువారం విచారణ జరిపారు.
సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం రాత్రి 11.30 గంటల సమయంలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ ను ఆయన సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు"వ్యూహం"చిత్ర నిర్మాత, దర్శకుడు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఈ సినిమాను రూపొందిం చారని లోకేశ్ తరఫు న్యాయవాదులు శ్రవణ్ కుమార్, మురళీధరరావు వాదించారు.
దర్శక నిర్మాతలకు ఆర్థికంగా ఒక నాయకుడు సహకారం అందిస్తున్నారని వారు ఆరోపించారు. అయితే నిర్మాతల తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ, ట్రయలర్ ను చూసి సినిమాను నిలిపివేయాలని కోరడం సమంజసం కాదన్నారు...
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >