| Daily భారత్
Logo




జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం విప్ ఆది శ్రీనివాస్

News

Posted on 2023-12-29 18:14:38

Share: Share


జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల జర్నలిస్టులకు ఆరు మాసాల్లో ఇండ్ల పట్టాలు నిర్మాణాలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పాటుపడుతామని,  పట్టాలు రాని జర్నలిస్టులకు పట్టాలు ఇప్పించడంతోపాటు జర్నలిస్టులు అందరికీ ఇండ్ల నిర్మాణానికి ఆరు మాసాలలోపు పరిష్కరించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి లను ప్రెస్ క్లబ్ పాలకవర్గం, సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చామని గుర్తుచేశారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలాలతో పాటు ఇండ్లను కూడా ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్, ప్రధాన కార్యదర్శి పరకాల ప్రవీణ్ కుమార్, రఘు రాపెళ్లి భాస్కర్ కాయితి మహేందర్ సీనియర్ జర్నలిస్టులు కరుణాల భద్రాచలం, తడుక విశ్వనాథం టివి నారాయణ, రాపెళ్లి సంతోష్ కుమార్, ఊరడి మల్లికార్జున్ రాచ లక్ష్మణ్ మిట్టపల్లి కాశీనాథ్ కాంబోజి ముత్యం మేడి కిషన్ ప్రెస్ క్లబ్ పాలకవర్గం సభ్యులు అల్లే రమేష్ నాయిని బాబు రాజా రమేష్ ఆన్సర్ అలీ దయానంద్ శిరీష నాలుగు పాల్గొన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >