Posted on 2025-09-24 14:54:36
డైలీ బారత్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర ప్రజాసాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా బతుకమ్మ పోస్టర్ విడుదల కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమం నిజామాబాద్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. పోస్టర్‌ను మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ అనురాధ, తెలంగాణ గెజెటెడ్ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సంగం అమృత్ కుమార్, టీజిఓ మహిళా విభాగం చైర్ పర్సన్ జయంతి కుమారి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయ, సాంస్కృతిక విశిష్టతను ప్రతిబింబిస్తుందని, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. విద్యార్థినులు ఈ పండుగను సాంస్కృతిక ఉత్సవంగా భావించి ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీవో పదాధికారులు దేవిసింగ్, పవనీ, నాగరాజు, చంద్ర, విజ్నేష్, సరస్వతి, విజయత, శ్రీతిల, సుజాత పాల్గొన్నారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >