| Daily భారత్
Logo




ఈ నెల 29న స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల?

News

Posted on 2025-09-24 18:24:11

Share: Share


ఈ నెల 29న స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల?

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామపంచాయతీలు మండలాల పరిధిలో రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ చేపట్టారు. మండలలోని ఎంపీటీసీలు సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డిఓలు గ్రామాల్లోని వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు.. సంబంధిత అధికారులతో కలెక్టర్లు సమావేశమయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలీసు, పోలింగ్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతారని, అంత మొత్తం లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ వద్ద లేరని కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించారు. 

తమ వద్ద ఉన్న సిబ్బంది ఆధారంగా రెండు, మూడు విడతల్లో పోలింగ్​నిర్వహించాలని కోరారు. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదనలు పంపగా.. సమస్యాత్మక గ్రామాలు, మండలాలు ఉన్న జిల్లాల కలెక్టర్లు మాత్రం మూడు విడతల్లో ఎలక్షన్స్ నిర్వహించాలని నివేదించినట్టు సమాచారం. 

ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు గోప్యంగా ఉంచారు. బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీచేసిన  అనంతరమే రిజర్వేషన్లు ప్రక్రియకు సంబంధించిన జాబితాను పంచాయతీరాజ్ శాఖ, బుధ, లేక గురువారం విడుదల చేయనుంది. 

మరోసారి ప్రభుత్వంతో సంప్రదించి ఎన్ని విడుతల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకొనున్నారు.అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 29న షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది, అక్టోబర్ రెండో వారంలో ఫస్ట్ విడత  నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది, నవంబర్ 10 కల్లా సర్పంచ్ ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >