| Daily భారత్
Logo




ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన జిల్లా CCS పోలీసులు, మోతే పోలీసులు

News

Posted on 2025-09-25 08:12:40

Share: Share


ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన జిల్లా CCS పోలీసులు, మోతే పోలీసులు

సుమారు 20 లక్షల విలువైన 18 తులాలు బంగారు ఆభరణాలు స్వాధీనం.

ప్రజలు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి.

విలువైన ఆభరణాలు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అనుమానితులు ఉంటే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.

డైలీ భారత్, సూర్యాపేట: ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు మరియు నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులే టార్గెట్ గా బంగారం చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసిన మోతే పోలీసులు, జిల్లా CCS పోలీసులు, పట్టుబడ్డ నిందితుల నుంచి రూ 20 లక్షల విలువ చేసే 18 తులాల బంగారు అభరణాలు, ఒక కారు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు

ప్రజలు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి విలువైన ఆభరణాలు ఉంటే అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ తెలిపారు.

2024 సంవత్సరం ఆగస్టు నెల 18 వ తేదిన పులిచింతల అరుంధతి వయసు 50 సంవత్సరాలు తుంగతుర్తి గ్రామము కేతపల్లి మండలం నల్లగొండ జిల్లా మహిళా మోతే మండలంలో విబులాపురం గ్రామంలో తన దగ్గరి బంధువుల పెళ్లికి వెళుతూ తన బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగ్ తో  సూర్యాపేటలో బస్సు స్టాండ్ లో ఖమ్మం డిపోకు చెందిన బస్సులో మరో ఇద్దరు చుట్టాలతో కలిసి వెళుతుండగా ఎలాంటి అనానం రాకుండా ఆమె బంగారు ఆభరణాలు దొంగతనం చేశారు. ఆరు తులాల నాలుగు లైన్ బంగారపు గాజులు, మూడున్నర తులాల చేతి కంకణాలు, ఐదు తులాల చంద్రహారం, మూడున్నర తులాల బంగారపు నల్లపూసల గొలుసు మొత్తం గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించకపోయారు అని ఫిర్యాదు చేయగా అప్పటి SI గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగినది. త్వరితగతిన పరిశీలించి నిందితులను పట్టుకోవడం కోసం మునగాల సర్కిల్స్ రామకృష్ణారెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ మరియు సిసిఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో సాంకేతికతను సద్వినియోగం చేసుకొని అందుబాటులో ఉన్న ఆధారాలతో ఈ కేసులో ముందుకుపోయి నిందితులను గుర్తించి వారి యొక్క కదలికలపై నిఘా ఉంచినారు, కేసు దర్యాప్తులో ఉండగా ఈరోజు ఇద్దరు దొంగలను అరెస్టు చేయడం జరిగినది. 

24వ తేదీ బుధవారం రోజు సాయంత్రం 6 గంటల సమయంలో సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై మోతే పోలీస్ స్టేషన్ పరిధి నందు మామిల్లగూడెం టోల్ ప్లాజా వద్ద మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ వైపు నుండి  వస్తున్న ఒక కారుని ఆపడం జరిగినది కారులో అనుమాదాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది వారి వద్ద సుమారు రూ.20 లక్షల విలువైన 18 తులాల బంగారు ఆభరణాలు గుర్తించారు. ఆభరణాలకు సంబంధించి సరైన ఆధారాలు సమాధానం తెలుపకపోవడంతో అనుమానం వచ్చి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు తనికి టీం వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగినది. విచారించగా బుద్రాపేట్ గ్రామము కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత నివాసము అల్మాస్గూడ హైదరాబాద్ కు చెందిన 57 సంవత్సరాల మహిళ (A-1) గారడి జ్యోతి భర్త రామకృష్ణ, హైదరాబాదు బడంగ్ పేటకు  చెందిన (A-3) మహమ్మద్ షేక్ సమీర్ 32 సంవత్సరాలు అని గా ఒప్పుకున్నారు, 2024 సం. ఆగస్టు నెలలో సూర్యాపేట నుండి మోతే మీదుగా ఖమ్మం వెళుతున్న RTC బస్సు నందు ఒక మహిళ వద్ద నుండి బంగారు ఆభరణాలు పెట్టిన హ్యాండ్ బ్యాగ్ ను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. A-1 నిందితురాలు గారడి జ్యోతి పై హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పాత దొంగతనం కేసులు ఉన్నందున ఈ బంగారం అక్కడ అమ్మితే అనుమానం వచ్చి అరెస్ట్ చేస్తారని దానిని దాచి బుధవారం రోజున ఆంధ్ర ప్రాంతంలో అమ్మాలన్న ఉద్దేశంతో A-3 మహమ్మద్ షేక్ సమీర్ తో కలిసి అతని బాలెనో కారులో హైదరాబాద్ నుండి బయలుదేరి ఖమ్మం మీదుగా ఆంధ్ర కు వెళ్లాలన్న ఉద్దేశంతో వెళ్ళుచుండగా  మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో మామిళ్లగూడెం వద్ద మోతే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగినది. 

ఈ దొంగతనంలో వీరిద్దరితో పాటు మరొక వ్యక్తి A-2 దుర్గ అనే మహిళా కూడా ఉన్నారు. ప్రస్తుతం దుర్గ పరారీ లో ఉన్నది  ఈమెను కూడా త్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది.

స్వాధీనం సొత్తు వివరాలు :

1. సుమారు రూ.20 లక్షల విలువైన 18 తులాల బంగారు ఆభరణాలు.

2. ఒక మారితి బాలేనో కారు.

3. రెండు మొబైల్ ఫోన్ లు.

పట్టుబడిన నిందితులు..

A-1 : గారడి జ్యోతి భర్త రామకృష్ణ, వ.57 సం.లు, బుద్రాపేట్ గ్రామము కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత నివాసము అల్మాస్గూడ హైదరాబాద్.

A-2 : దుర్గ (పరారీలో ఉన్నది)

A-3 : మహమ్మద్ షేక్ సమీర్ 32 సంవత్సరాలు, బడంగ్ పేట, హైదరాబాద్. 

A1 జ్యోతి పై మహబూబ్నగర్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో 7 దొంగతనం కేసులు ఉన్నాయి, A2, A3 పై కేసులు ఎన్ని అనేది పరిశీలిస్తున్నాం అని ఎస్పి తెలిపినారు.

ఈ కేసులో బాగా పనిచేసిన సిసిఎస్ సిబ్బందికి రివార్డ్స్ అందించి అభినందనలు తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిసిఆర్బి  డిఎస్పి రవి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, అప్పటి మోతే ఎస్సై యాదవెందర్ రెడ్డి, సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ, సిసిఎస్ సిబ్బంది ఉన్నారు.

Image 1

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-04-10 01:29:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >