| Daily భారత్
Logo




బతుకమ్మ ఉత్సవాల ఏర్పాటుకు గ్రామపంచాయతీలకు సరిపడ నిధులు కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వం

News

Posted on 2025-09-25 07:34:59

Share: Share


బతుకమ్మ ఉత్సవాల ఏర్పాటుకు గ్రామపంచాయతీలకు సరిపడ నిధులు కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వం

గ్రామాలలో బతుకమ్మ దసరా ఉత్సవాల ఏర్పాట్లకు నిధులు లేక మానసిక క్షోభకు గురి అవుతున్న పంచాయతీ కార్యదర్శులు,అధికారులు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో కలతప్పిన గ్రామాలు , నిధులు లేక లోపించిన పారిశుధ్యం.

అన్ని గ్రామాలలో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లలో పాల్గొనాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు,మాజీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి .

డైలీ భారత్ న్యూస్, నర్సంపేట:తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలబడి ఆడపడుచులకు ఆత్మ గౌరవ ప్రతీకగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బతుకమ్మ పండగ నేడు గ్రామాలలో కలతప్పింది.

కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలకు సరిపడా నిధులు కేటాయించకపోవడంతో గ్రామాలలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు చందాల ద్వారా గ్రామ పెద్దల ద్వారా నిధులు సేకరించి బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేసుకునే దుస్థితి నేడు తెలంగాణలో కనబడుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వ  అసమర్ధ పాలన వలన గ్రామపంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది అప్పులు తెచ్చి గ్రామాలలో పరిశుద్ధ పనులు చేస్తున్నారు,డీజిల్ కు డబ్బులు లేక ట్రాక్టర్లను నడపడం లేదు బ్లీచింగ్ పౌడర్ ,ఫాగింగ్ వీధిలైట్ల మరమ్మత్తులను పట్టించుకునే వారే లేరు.గ్రామాలలో బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయలేమని ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ ఆదనంగా పండగ కోసం సరిపడా నిధులు కేటాయించలేదు.

గత బిఆర్ఎస్ పాలనలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రపంచానికి బతుకమ్మ ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా నిర్వహించినారు.గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాక గ్రామపంచాయతీలలో పాలక మండలి లేక బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు  సరిగా జరగడం లేదు .గ్రామాలలో పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోవడంతో పారిశుధ్యం లోపించి గ్రామాలు కల తప్పినవి. 

నియోజకవర్గ వ్యాప్తంగా  అన్ని గ్రామాలలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,మాజీ ప్రజా ప్రతినిధులు  జెడ్పిటిసిలు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు మరియు పార్టీ నాయకత్వం గ్రామాలలో బతుకమ్మ ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు చేయాలని తమ ఆర్థిక స్తోమతను బట్టి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఆడపడుచుల ఆశీర్వాదం  పొందాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >