| Daily భారత్
Logo




తెలుగు తల్లి కాదు.. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌

News

Posted on 2025-09-25 04:51:06

Share: Share


తెలుగు తల్లి కాదు.. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌

డైలీ భారత్, హైదరాబాద్: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా పేరు మార్చే అంశానికి స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి సెక్రటేరియట్‌ వరకు కలిపే వంతెన పేరు మార్చాలని బుధవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.

లోయర్ ట్యాంక్ బండ్ నుండి సెక్రటేరియట్ వరకు కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ కు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం కార్పొరేషన్‌కు సిఫార్సు చేయాలని జీహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదించింది.నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం లో జరిగింది. కమిటీ సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్ ఐటమ్ లకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. స్టార్మ్ వాటర్ డ్రెయిన్ (ఆర్‌సిసిబాక్స్ డ్రెయిన్) నిర్మాణం సాయి నగర్ ఆర్చ్ నుండి టి.ఐ.ఎఫ్.ఆర్ కాంపౌండ్ వాల్ కల్వర్ట్ వరకు, వార్డు నం.3లోని కృష్ణారెడ్డి నగర్ రోడ్ నం.1, రోడ్డు నం.2, కాప్రా సర్కిల్, చర్లపల్లి లో రూ.285.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మించేందుకు కార్పొరేషన్‌కు సిఫార్సు పరిపాలన ఆమోదం కోరబడింది. సీసీ రోడ్డు నిర్మాణం అల్వల్ సర్కిల్ వార్డు నం.133లో హై టెన్షన్ లైన్ మార్గంలో వి.బి.ఆర్ గార్డెన్స్ నుండి ఎస్.ఎన్. రెడ్డి ఎన్ క్లేవ్ వరకు 2025-26 ఆర్థిక సంవత్సర నిధులు రూ.450.00 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మణానికి టెండర్లు పిలిచేందుకు అనుమతి.

కాప్రా సర్కిల్ వార్డు నం. 2 లో భవాని నగర్ నుండి బావి బజార్ నాలా మీదుగా ఇ.టి.డి.సి నార్త్ కమలా నగర్ నాలా వరకు రూ.395.00 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆర్‌సిసి బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి కార్పొరేషన్‌కు సిఫార్సు పరిపాలన ఆమోదించారు. మల్కాజిగిరి సర్కిల్, డివిజన్ 136లో ఆర్‌కే పురం ఫ్లైఓవర్ కింద స్పోరట్స్ జోన్ ఆపరేషన్, నిర్వహణ బాధ్యతలను అనుభవజ్ఞులైన ఏజెన్సీకి అప్పగించేందుకు ఆమోదించారు. మూసాపేటలోని కెపిహెచ్‌బి మల్టీపర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్ లో వివిధ స్పోరట్స్ కార్యకాలపాలకు యూజర్ చార్జీలు ఫిక్స్ చేయడం కోసం ఆమోదం కొరకు సమర్పణ. బండ్లగూడ మల్టీపర్పస్ స్పోరట్స్ స్టేడియంలో అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల నియామకానికి అనుమతి కోరబడింది. జీహెచ్‌ఎంసీ అవుట్‌సోర్సింగ్/ స్వయం సహాయక సంఘాల వర్కర్ల జీత ఖాతాలను ప్రైవేట్ బ్యాంకులో ప్రారంభించడానికి ప్రతిపాదన  స్టాండింగ్ కమిటీ ముందు సమర్పించారు. క్రింది అంశాలపై ఆమోదం కోరబడింది. తద్వారా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మరియు టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లబ్ది కలిగేలా చూడాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమీషనర్ ఆర్.వి కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >