Posted on 2025-09-25 16:13:06
గత ప్రభుత్వంలో నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ధర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో సామూహిక గృహప్రవేశ మహోత్సవంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. గృహప్రవేశం చేసిన కుటుంబాలను రూరల్ ఎమ్మెల్యే పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పధకం ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గంలో మొట్టమొదటిసారి గృహప్రవేశాలు జరగడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ 20 నెలల్లోనే పేదల కలల్ని నిజం చేసింది” అన్నారు. “మూడు ఏళ్లకే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పోలిస్తే, స్థానిక మేస్ట్రీలు కట్టిన ఇందిరమ్మ ఇళ్లు 50 ఏళ్లు నిలుస్తాయని అన్నారు. “రైతు బోనస్, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో రైతుకు అండగా నిలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమములో పీసీసీ డెలికెట్ శేఖర్ గౌడ్ , డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగీత్య నాయక్, జిల్లా స్పోక్ పర్సన్ చెలిమెల నర్సయ్య, జిల్లా నాయకులు గాదరి మనోహర్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, దర్పల్లి, హోన్నజీపేట సొసైటీల చేర్మెన్లు చెలిమేల మల్లికార్జున్, జనార్దన్ రెడ్డి, హోన్నజీపేట గ్రామ మాజీ సర్పంచ్ భగవంత్ రెడ్డి, సుభాష్ రెడ్డి, సుభాష్ రెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి, సీతాయిపేట్ మాజీ సర్పంచ్ లోక్కిడి విజయ రాములు,నాయకులు చెలిమేల శ్రీనివాస్,అబ్దుల్ హమీద్, బేల్దారి క్రిష్ణ, వాడి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >