| Daily భారత్
Logo




మద్యం షాపుల రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

News

Posted on 2025-09-25 18:03:14

Share: Share


మద్యం షాపుల రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జిల్లాలో మొత్తం 48 దుకాణాలు

గౌడ్లకు 9, ఎస్సీలకు 5 కేటాయింపు

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో 2025- 2027 సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రకారం రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. నూతన మద్యం దుకాణాల కోసం రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎక్సైజ్ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో డ్రా ను గురువారం కలెక్టర్ చేపట్టారు. 

జిల్లాలో మొత్తం 48 దుకాణాలు ఉన్నాయని, వాటిలో గౌడ్లకు 9, ఎస్సీ లకు 5 రిజర్వేషన్ ప్రకారం కేటాయించామని కలెక్టర్ వెల్లడించారు. రౌండ్ల వారిగా డ్రాను తీశారు. 

ఎస్సీలకు డ్రా పద్ధతిలో వచ్చిన దుకాణాల నంబర్లు

14, 28, 34, 40, 43

గౌడ్లకు డ్రా పద్ధతిలో వచ్చిన 9 దుకాణాల నంబర్లు

02,15,17,18, 33,36,38,46,48

రేపటి నుంచి.. ఈ నెల 26వ తేదీన టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరించనున్నారు. అప్లికేషన్లు ఇచ్చేందుకు ఆఖరి గడువు వచ్చే నెల(అక్టోబర్) 18వ తేదీ కాగా, వచ్చే నెల 23వ తేదీన దుకాణాల లైసెన్స్ కేటాయించేందుకు డ్రా తీయనున్నారు. డిసెంబర్ 01 వ తేదీ నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి.

కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి రాధాకృష్ణారెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, సీఐలు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >