| Daily భారత్
Logo




గురితప్పిన గులేరు

News

Posted on 2023-12-31 14:54:36

Share: Share


గురితప్పిన గులేరు

డైలీ భారత్, జనగామ: గురితప్పిన గులేరు ఓ వ్యక్తిని జైలు పాలు చేసింది. పిట్టను కొట్టబోయి గురితప్పి వందే భారత్ ట్రైన్ కిటికీ అద్దం పగులగొట్టడంతో రైల్వే పోలీసులు వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

వివరాల్లోకి వెళితే.. జనగామ పట్టణం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన హరిబాబును వందే భారత్ ట్రైన్‌పై రాళ్లు విసిరిన కేసులో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్పీఎఫ్‌ సీఐ సంజీవరావు కథనం ప్రకారం.. జనగామకు చెందిన హరిబాబు పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుంటుంటారు.

ఈ నేపథ్యంలో జనగామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం పిట్టలు కొట్టడానికి గులేరుతో ప్రయత్నించాడు.అయితే అదిగురితప్పి..పొరపాటున విశాఖపట్నం నుంచి హైదరా బాద్‌ వెళుతున్న 20833 నంబరు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌కు తగిలింది.

ఈ ఘటనలో ట్రైన్ కిటికీ అద్దం పగిలింది. కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు.. సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో విచారించగా హరిబాబు చేసిన పని అని తేలింది. గులేరును సీజ్‌ చేసి అతడిని అరెస్టు చేసిశనివారం సాయంత్రం జైలుకు పంపించారు.

గులేరు గురితప్పి పొరపాటు న వందే భారత్ ట్రైన్‌కు తగిలిందని అందులో తన తప్పేమీ లేదని బాధితుడు వాపోయాడు

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >