| Daily భారత్
Logo




మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం

News

Posted on 2025-10-08 06:55:48

Share: Share


మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం

డైలీ భారత్, న్యూఢిల్లీ: భారత సినీ రంగంలో నాలుగు దశాబ్దాలుగా తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్  ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈయనకు ఇప్పుడు భారత సైన్యం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన "సీవోఏఎస్‌ కమెండేషన్‌"  అవార్డు లభించింది. ఈ అవార్డు భారత ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చేత ప్రతి సంవత్సరం విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ప్రదానం చేయబడుతుంది

భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్వయంగా ఈ పురస్కారాన్ని మోహన్‌లాల్‌కు అందజేశారు. మంగళవారం న్యూ ఢిల్లీ లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్‌ లెఫ్టినెంట్‌ కర్నల్‌ హోదాలో పాల్గొన్నారు. సైన్యంలో విశిష్ట సేవలందించిన వారిని సత్కరించేందుకు ఇచ్చే ఈ అవార్డు మోహన్‌లాల్‌ కెరీర్‌లో మరో ప్రాధాన్యత సాధించింది. 

ఈ సందర్భంగా మోహన్‌లాల్‌  సోషల్‌మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకుంటూ.. “ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు గర్వకారణం. ఒక గౌరవ లెఫ్టినెంట్‌ కర్నల్‌ గా ఈ గుర్తింపు పొందడం నా జీవితంలో స్ఫూర్తిదాయకమైన క్షణం. భారత సైన్యం, టెరిటోరియల్‌ ఆర్మీ యూనిట్‌ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు


#COAS Commendation #mohanlal

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >