Posted on 2025-10-08 08:26:50
చేత కాకపోతే జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి..
బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లాలో ఆర్ఓబి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి ఏళ్లు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ కు కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించడంలో పూర్తిగా విఫలం చెందిందని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం మాధవ్ నగర్ ఆర్ఓబి బ్రిడ్జి వద్ద బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీర్పు నిరసనగా రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం మట్టిని తవ్వి గుంటల్లో పేర్చారు. జిల్లా కాంగ్రెస్కే పెద్దమనిషిగా చెప్పుకునే సుదర్శన్ రెడ్డి మంత్రిగాని మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా ఇదే అయినప్పటికీ ఆరోపణల్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్ఓబి పనులు త్వరగా చేపట్టకపోవడం వల్ల రోజుకు పదుల సంఖ్యలో గుంతలో పడి గాయాల పాలవుతున్నారని ఆయన అన్నారు. కేవలం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతాకానితనం వల్లే జిల్లాకి ముఖద్వారం లాంటి మాధవ నగర్ ఆర్ఓబి పనులు నిలిచిపోవడం సిగ్గుచేటు అన్నారు. వారికి చేతకాకపోతే రాజీనామా చేయాలని మండిపడ్డారు. రాస్తారోకో కార్యక్రమం వల్ల భారీగా వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. బిజెపి జిల్లా కార్యదర్శి రాంపల్లి జ్యోతి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బీ వరలక్ష్మి, నిజామాబాద్ నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ నిజామాబాద్ నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతాన్ కర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >