Posted on 2025-10-09 08:41:41
-మహిళల మానసిక ఆరోగ్య సదస్సులో సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ పిలుపు.
డైలీ భారత్, సిరిసిల్ల: మానసిక ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకొని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ఈరోజు సుందరయ్య నగర్ లోని మహిళలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ ఏర్పాటు చేసి మాట్లాడినారు.
ఈ సందర్భంగా సైకాలజిస్ట్ పున్నంచందర్ మాటడుతూ మహిళలు మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
ఇటీవలి కాలంలో మహిళలు కుటుంబం, ఉద్యోగం, సామాజిక బాధ్యతలు, మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం సాధించడంలో అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఈ ఒత్తిడి ఫలితంగా ఆందోళన, నిరాశ, నిద్రలేమి, కోపం, మరియు శారీరక అనారోగ్యాలు ఏర్పడుతున్నాయని అన్నారు.
మహిళలు తమ కుటుంబ అవసరాలనే కాకుండా, తమ వ్యక్తిగత మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా సంరక్షించు కోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఒక సంతోషకరమైన తల్లి, భార్య, ఉద్యోగిని కావాలంటే, ముందు మనసు ప్రశాంతంగా ఉండాలని అన్నారు.
మానసిక ఆరోగ్యం కోసం మహిళలు ప్రతిరోజూ స్వీయ సంరక్షణ, మంచి అలవాట్లు అవలంబించాలని తెలిపారు.
సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, యోగా స్నేహితులతో సంభాషణ, అవసరమైతే సైకాలజిస్టు సహాయం పొందడం లాంటివి చేయాలని అన్నారు.
ఆరోగ్యకరమైన మనస్సే నిజమైన ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది రాపేల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ, మహిళలు పాల్గొన్నారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >