| Daily భారత్
Logo




టేకాఫ్‌ తరువాత కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తప్పిన ప్రమాదం

News

Posted on 2025-10-09 12:13:47

Share: Share


టేకాఫ్‌ తరువాత కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తప్పిన ప్రమాదం

డైలీ భారత్, ఫరూఖాబాద్: విజయవంతంగా టేకాఫ్ అయిన విమానం.. గాలిలో చక్కర్లు కొట్టకుండా.. చెట్ల పొదల్లో కుప్పకూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ పైలట్లు, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రైవేట్ జెట్ రన్‌వే నుండి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే బ్యాలెన్స్ కోల్పోయి రన్‌వే పక్కన ఉన్న చెట్లపైకి దూసుకెళ్లింది.

విమానం భాగాలు చెట్లలో చిక్కుకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక అధికారులు తెలిపారు. వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, జెట్‌లో ఇద్దరు పైలట్లు, ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానయాన శాఖ (DGCA) ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >