| Daily భారత్
Logo




బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నది తోడు దొంగల పార్టీలు బిజెపి, బిఆర్ఎస్ పార్టీలే

News

Posted on 2025-10-09 16:18:24

Share: Share


బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నది తోడు దొంగల పార్టీలు  బిజెపి, బిఆర్ఎస్ పార్టీలే

గవర్నర్ వద్ద  పార్లమెంట్ లో అడ్డుకున్నది బిజెపి అయితే కోర్టులో కేసు వేసి అడ్డుకున్నది బిఆర్ఎస్

42 శాతం రిజర్వేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున తాము బలమైన వాదనాలు వినిపించాం, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇలా మధ్యంతర స్టే విధిస్తుందని అనుకోలేదన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తామని  షబ్బీర్ అలీ అన్నారు. మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. బీసీ 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కుల సర్వేలు నిర్వహించింది, కృత నిశ్చయంతో వన్ మెన్ కమిషన్ వేసింది. కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది,శాసన సభలో చట్టం చేసి గవర్నర్ కు పంపించామన్నారు. 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశాం అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్న విధంగా ఇక్కడ కూడా చేస్తాం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, గ్రామాల్లో అభివృద్ధి చేయలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో సామాజిక న్యాయం జరుగుతుందని, బీసీలకు 42  శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జీవో 9తో ముందుకు వెళుతుంటే కోర్టులో అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తరపున కోర్టులో బలంగా వాదనలు వినిపిస్తుంటే, బీఆర్ ఎస్, బీజేపీలు ఎందుకు ఇంప్లీడ్ కాలేదో ప్రజలకు జవాబు చెప్పాలని అన్నారు. వీరి నాటకాన్ని ప్రజల ముందు ఉంచుతాం బిజెపి, బిఆర్ఎస్ రెండు ఒకటే అని ప్రజలకు చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. 42 శాతంతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. కోర్టులో ఇంకా గట్టిగా వాదన వినిపించి 42 శాతానికి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్ కి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >