| Daily భారత్
Logo




ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి గౌరవం

News

Posted on 2025-10-10 14:49:37

Share: Share


ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి గౌరవం

రాష్ట్ర పురోగతికి శాశ్వత దిశానిర్దేశం చేసిన విజనరీ నాయకుడు సీఎం చంద్రబాబు : మంత్రి అచ్చెన్నాయుడు

డైలీ భారత్, అమరావతి:  రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి, ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానం పూర్తయిన సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ...

చంద్రబాబు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక విజనరీ స్టేట్స్‌మన్, ఒక ప్రతిభావంతుడు శిల్పి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ముందుగానే ఊహించి, ఆధునిక సాంకేతికతతో, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి విధానాలతో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిన గొప్ప నాయకుడు ఆయన. ఐటి రంగం ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపిన దార్శనికుడు, రైతుకు సాంకేతికతను చేరువ చేసిన సంస్కర్త, యువతకు అవకాశాల ద్వారాలు తెరిచిన మార్గదర్శి చంద్రబాబు అని అన్నారు. ఏ రంగంలో చూసినా ఆయన దూరదృష్టి, కష్టపడే తీరు, పారదర్శక పాలనకు నిదర్శనం. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ-గవర్నెన్స్, వాటర్ మేనేజ్‌మెంట్, ఫార్మ్ టు మార్కెట్ లింకేజెస్ వంటి అంశాలను అమలుచేసి రాష్ట్రాన్ని ఆధునిక దిశగా నడిపించారు. ఆయన కలల అమరావతి రాజధాని ఆలోచన, గ్రామ సచివాలయాల భావన, రైతుల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకాలు, ప్రజా కేంద్రిత ఆలోచనలకు ప్రతీకలు అని మంత్రి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయకత్వం వహించే ప్రతి కాలం, ప్రతి నిర్ణయం ప్రజల జీవితాల్లో ఒక సానుకూల మార్పును తీసుకువస్తుంది. ఆయనలో ఉన్న సూక్ష్మ దృష్టి, పట్టుదల, పరిపాలన నైపుణ్యం, ప్రజాసేవా తపన ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. దేశ స్థాయిలోనూ ఆయన చేసిన కృషి అనన్యసామాన్యం. అభివృద్ధి, నూతన ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఆయనకు ఈ రోజు మరొక మైలురాయి అని అన్నారు. ఆయన వంటి విజనరీ నాయకుడు మన రాష్ట్రానికి వరం. ఆయన పాలనలోనే ఆంధ్రప్రదేశ్ నిజమైన అర్ధంలో సుజన పాలన, స్మార్ట్ రాష్ట్రం దిశగా పయనిస్తుంది అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు మరెన్నో విజయాలు, సుదీర్ఘ ఆరోగ్యం లభించాలని, రాష్ట్ర ప్రజల సేవలో ఆయన తపన కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >