| Daily భారత్
Logo




కొత్తగూడెం సింగరేణి ఏరియా కార్మిక కుటుంబాలను కోతుల బెడద నుండి రక్షించండి. పూల : రవీందర్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు

News

Posted on 2025-10-13 16:07:00

Share: Share


కొత్తగూడెం సింగరేణి ఏరియా కార్మిక కుటుంబాలను కోతుల బెడద నుండి రక్షించండి. పూల : రవీందర్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రోజురోజుకు కార్మిక కుటుంబాలపై కోతుల దాడులు ఎక్కువవుతున్న క్రమంలో కోతుల దాడి నుండి రక్షించాలని స్థానిక నాయకులు మందుల. జయరాజు  గారి ఆధ్వర్యంలో ఏరియా జిఎం శాలెం రాజు గారిని కలిసి మెమొరండం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్ మాట్లాడుతూ సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కార్మిక కుటుంబాల పిల్లలు మరియు మహిళలపై కోతులు పైశాచికంగా దాడులు చేసి గాయపరుస్తున్నాయని, మహిళలు మరియు స్కూలుకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులకు మరియు భయభ్రాంతులకు  గురవుతున్నారు.దీనివలన కార్మికులు డ్యూటీలకు వెళ్లిన సమయంలో ఇంట్లో వారి కుటుంబ సభ్యులకు భద్రత లేని కారణంగా డ్యూటీలు చేస్తున్న కార్మికులు సైతం వారి డ్యూటీలు సరిగా చేయలేరని, వారు డ్యూటీలో ఉన్నా కూడా ఇంట్లో వాళ్లపై కోతులు దాడి చేస్తాయేమో అని భయంతో డ్యూటీలు చేస్తున్నారని, వారి మనసును పనిమీద నిమగ్నం చేయలేరని తద్వారా సింగరేణి సంస్థకు కూడా నష్టం జరిగే అవకాశం ఉన్నది కావున తక్షణమే స్పందించి  కార్మిక కుటుంబాలకు కోతుల బెడద నుండి దాడుల నుండి రక్షణ కల్పించే చర్యలలో భాగంగా కోతులను వెంటనే పట్టించి   వాటిని ఊరికి దూరంగా అడవులలో వదిలేయాలని సింగరేణి వారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మందుల. జయరాజు, గుత్తుల.దుర్గాప్రసాద్ భూక్య. రవి,  మారేపల్లి. వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >