| Daily భారత్
Logo




అభయ హస్తం దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి: సిఎస్ శాంతి కుమారి

News

Posted on 2024-01-04 15:03:51

Share: Share


అభయ హస్తం దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి: సిఎస్ శాంతి కుమారి

డైలీ భారత్, హైదరాబాద్: ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈ నెల 17లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు.

ప్రజాపాలన నిర్వహణ, దరఖాస్తుల డాటా ఎంట్రీలపై కలెక్టర్లతో ఈరోజు టెలీకాన్ఫ రెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామసభ లను ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహి స్తుండడంపై కలెక్టర్లను సీఎస్‌ అభినందించారు.

6న ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి విచారణ చేయాలని ఆదేశించారు.మండల రెవెన్యూ అధికారులు, మండల డెవలప్‌మెంట్ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని, ప్రజాపాలన కార్యక్రమం సూపర్‌వైజరీ అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షిం చాలని తెలిపారు.

ఈ డాటా ఎంట్రీ చేపట్టేం దుకు జిల్లాస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రస్థాయిలో ట్రెయినీ ఆఫ్ ట్రైనర్ (TOT )లకు 4న శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ టీఓటీలకు జిల్లా స్థాయి లో డాటా ఎంట్రీ ఏవిధంగా చేయాలన్న దానిపై 5న శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

5 నుంచి 17 వరకు అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తి చేయా లని, ఈ డేటా ఎంట్రీ సందర్భంగా దరఖాస్తుదా రుల వివరాల నమోదులో ఆధార్ నెంబర్, వైట్ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.

జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న డీటీపీ ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను నియమిం చుకోవాలని ఆదేశించారు. నిన్నటి వరకు దాదాపు 57లక్షల దరఖాస్తులు అందాయని, ప్రతీ నాలుగునెలలకోసారి ప్రజాపాలన నిర్వహించా లని ప్రభుత్వం నిర్ణయిం చిందన్నారు.

దరఖాస్తులు ఇవ్వని వారు తిరిగి దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పంచాయితీ రాజ్ కమిషనర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >