| Daily భారత్
Logo




ఏసీబీ వలలో సిరిసిల్ల మండల సర్వేయర్

News

Posted on 2025-10-14 13:26:32

Share: Share


ఏసీబీ వలలో సిరిసిల్ల మండల సర్వేయర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు మరోసారి తన దాడితో సంచలనాన్ని సృష్టించారు. భూమి సర్వే కోసం లంచం తీసుకుంటుండగా సిరిసిల్ల మండల సర్వేయర్ వేణును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇరుకుల ప్రవీణ్ అనే వ్యక్తికి చిన్న బోనాలలో మూడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని సర్వే చేయడంలో భాగంగా సర్వేయర్ వేణు రూ.30 వేలు లంచం కోరినట్లు తెలుస్తోంది.

దీంతో బాధితుడు ఇరుకుల ప్రవీణ్ కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందుగా సర్వేయర్‌కి రూ.10 వేలు అప్పజెప్పగా, తర్వాత పంచనామా సర్టిఫికెట్ కోసం మిగతా రూ.20 వేలు అందజేయడానికి ఒప్పుకున్నాడు. ఈ సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు సిరిసిల్ల ఎమ్మార్వో కార్యాలయంలో మాటు వేశారు. బాధితుడు చేతిలోని రూ.20 వేల లంచం తీసుకుంటున్న వేణును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ ఘటనతో జిల్లా అధికార వర్గాల్లో కలకలం రేగింది. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో తక్కువ సమయంలో జరిగిన రెండో సర్వేయర్ అరెస్ట్ కావడం గమనార్హం. గత మే నెలలో ఎల్లారెడ్డిపేట సర్వేయర్ లంచం కేసులో పట్టుబడగా, ఇప్పుడు సిరిసిల్ల సర్వేయర్ వేణు ట్రాప్‌లో చిక్కుకోవడంతో జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >