Posted on 2025-10-14 14:36:41
డైలీ భారత్, విశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదు కావడానికి సిద్ధమైంది. మంత్రి నారా లోకేష్ కృషితో విశాఖపట్నంలో దేశంలోనే తొలి గూగుల్ AI హబ్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ ఆర్థిక, ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి.
గూగుల్ 10 బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250 కోట్లు)తో విశాఖలో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డిఐ ప్రాజెక్ట్ కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లాభం, 1.88 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రాష్ట్రానికి అదనంగా సుమారు రూ.9,553 కోట్ల వార్షిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. విశాఖపట్నం AI సిటీగా రూపాంతరం కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు AI నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో గూగుల్ బృందంతో చర్చలు జరపడం ద్వారా ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండింగ్, మంత్రి లోకేష్ కృషి కలిసి రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన విదేశీ పెట్టుబడిని సాధించాయన్నారు. ప్రపంచ దృష్టి ఆంధ్రప్రదేశ్ పై ఉండేలా ఈ ప్రాజెక్ట్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ AI, టెక్ హబ్‌గా నిలబెడుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >