| Daily భారత్
Logo




అన్ని దానాలు కన్నా అన్నదానం మహా మిన్న..

News

Posted on 2025-10-14 15:29:27

Share: Share


అన్ని దానాలు కన్నా అన్నదానం మహా మిన్న..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అన్ని దానాలు కన్నా అన్నదానం ఎంతో గొప్పదని సుంకోజు రాములు పేర్కొన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్డు లో గల భాగ్యలక్ష్మి ఎల్పిజి గ్యాస్ బంక్ వద్ద సుంకోజు భాగ్యలక్ష్మి శ్రీరాములు, సుంకోజు సంతోష్ కుమార్, మంగ, భాగ్యలక్ష్మి, సాత్విక, మల్లికార్జున్ వారి ఆధ్వర్యంలో గత శుక్రవారం నుండి అనాధ నిరశ్రాయులకు, నిరుపేదల కోసం ప్రతిరోజు ఉచితంగా మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు మహా అన్నదాన కార్యక్రమం బంకు ఆవరణలోనే నిర్వహించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. కులమతాలకతీతంగా ఎవరైనా ఆకలితో ఉన్నవారు పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు సంకల్పించినట్లు ఆయన వివరించారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమానికి నిరుపేదల వద్ద నుండి విశేష స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. గతంలో బాసర పుణ్యక్షేత్రం వద్ద తాను పేదవారికి ఇదే అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడికి తన సేవలు మార్చడం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఇది ఇలా ఉండగా అన్నదాన కార్యక్రమం ఇప్పటివరకు పలు స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలు చూసాము వచ్చినవారు తిని వెళ్తుంటారు, కానీ ఈయన నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో మాత్రం ఈ నా దగ్గరికి వచ్చే నిరుపేదలకు కనీసం ప్లేట్లు కడగలేని నిరుపేదలు, వృద్ధులు అన్నదాన కార్యక్రమానికి వచ్చి ప్లేట్లు అలాగే వదిలేసి వెళ్లడంతో స్వయంగా ఆయనే ప్లేట్లు కలిగి వచ్చిన వారికి ఆహారం అందించిన గొప్ప మానవతావాది అయిన అని చెప్పనక్కర్లేదు.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >