| Daily భారత్
Logo




తల్లిదండ్రులు, గురువులకు గౌరవిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు

News

Posted on 2025-10-14 17:50:53

Share: Share


తల్లిదండ్రులు, గురువులకు గౌరవిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు

విజయ్ స్కూల్ టాలెంట్ షో లో ప్రముఖులు వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తల్లిదండ్రులు, గురువుల మాట వింటే చాలు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని (ప్లేబ్యాక్ సింగర్ అండ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు)

డాక్టర్ కె రామాచారి అన్నారు. మంగళవారం నగరంలోని ముబారక్ నగర్ లోని విజయ్ పాఠశాల 45 వ టాలెంట్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన (ప్లేబ్యాక్ సింగర్ అండ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు) డాక్టర్ కె రామాచారి, గౌరవ అతిథి గా(గీత రచయిత అండ్ జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత) కాసర్ల శ్యామ్, గౌరవ అతిథి గా (రచయిత్రి, సంపాదకురాలు, నటి, శాస్త్రీయ నృత్యకారిణి) సరస్వతి కరావడి, విజయ్ విద్యాసంస్థల కార్యదర్శి అమృతలత లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి టాలెంట్ షో ను ప్రారంభించారు. విజయ్ హై స్కూల్ 45 వ టాలెంట్ షో సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాను చదివిన పాఠశాలను, టీచర్లలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 45 సంవత్సరాలు విజయ్ స్కూల్ పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమని తెలియజేశారు. రైతులు ఎంత కష్ట పడి పండిస్తారో, అలాగే విద్యార్థులకు విద్య నేర్పించి ఉన్నత స్థాయిలో కి ఎదిగేలా కృషి చేసేది పాఠశాలలు ఆన్నారు. బడి అన్నా పిల్లలన్నా నాకెంతో ఇష్టమని, ఈ విద్యాసంస్థల్లో ఒక పండగ వాతావరణం తనకు కనిపించిందన్నారు. డాక్టర్ అమృతలత రచయితగా,రాజకీయ వేత్తగా వివిధ రంగాలలో ప్రవీణ్యురాలై విద్యార్థులను తీర్చి దిద్దుతున్న ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. విద్యార్థుల జీవితాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆడపిల్లలని ఆదరించి వారికి ప్రోత్సహిస్తే వారి జీవితాల్లో వెలుగును నింపుతారని తెలిపారు. సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని, చదువు తోపాటు క్రీడలు, లలిత కళలు, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి.ఉన్న ఒక జీవితానికి మంచిగా జీవించాలన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్ణయించుకొని ముందుకు సాగలన్నారు.

అలరించిన చిన్నారుల నృత్యాలు

వార్షికోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులకు 2025-26 సంవత్సరానికి అన్ని రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాలను అందించారు. అనంతరం ముఖ్య అతిథులను విజయ్ పాఠశాల తరఫున మెమెంటో, శాలువాలతో సత్కరించారు. టాలెంట్ షో కార్యక్రమంలో చిన్నారులు  చేసిన నృత్యాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. సినీ పాటలపై చిన్నారులు, విద్యార్థులు చేసిన డాన్స్ లు , భరతనాట్యం ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి అమృతలత, రమాదేవి, లలిత దేవి, విజయ భారతి, విజయ లక్ష్మి, మధు, కరస్పాండెంట్ ప్రభాదేవి అకాడమిక్ డైరెక్టర్ వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సుజాత, ప్రిన్సిపల్ విజేత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.


Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >