Posted on 2025-10-15 06:45:26
డైలీ భారత్, గుంటూరు:రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం చేసిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ రోమాలు నిక్కబొడిచే దారుణమైన ఘటన గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న రైల్లో చోటుచేసుకుంది. ప్రయాణం మధ్యలో గుర్తు తెలియని దుండగుడు మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. సంఘటన సమయంలో రైలు ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రయాణిస్తోంది. బాధితురాలి హ్యాండ్‌బ్యాగ్‌ను దోచుకున్న దుండగుడు, వెంటనే స్టేషన్ వద్ద దిగిపోయి పరారయ్యాడు.
షాక్‌కు గురైన మహిళ చర్లపల్లికి చేరుకున్న వెంటనే జీఆర్పీ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ప్రమాదకర పరిస్థితుల్లో రైలులో జరిగిన ఈ దారుణం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. రైల్లో సెక్యూరిటీ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. రైల్వే పోలీసులు నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >