| Daily భారత్
Logo




జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీ, దొంగ పాస్పోర్టులు, డ్రగ్స్,ల దందా చేసింది మాజీ మంత్రి కేటీఆర్ కాదా..?

News

Posted on 2025-10-15 08:46:59

Share: Share


జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీ, దొంగ పాస్పోర్టులు, డ్రగ్స్,ల దందా చేసింది మాజీ మంత్రి కేటీఆర్ కాదా..?

మహేష్ కుమార్ గౌడ్కు చదువు రాకుంటే ట్యూషన్కు వెళ్లి చదువు నేర్చుకో..

పిసిసి చీప్ పై నిప్పులు జరిగిన నిజామాబాద్ ఎంపీ అరవింద్..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జూబ్లీ హిల్స్ లో ఓట్ల చోరీ, దొంగ ఓట్లు, జరిగిందని కేటీఆర్ అనటం హాస్యాస్పదంగా ఉందని, రాష్ట్రంలో దొంగ ఓట్లు తెచ్చిందే బిఅరెస్ పార్టీ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. చదువురాని పీసీసీ చీఫ్ ఇకనైనా ప్రత్యేకంగా ట్యూషన్ క్లాసులకు వెళ్లి ఆర్ఓబి పనులపై కేంద్రం ఇచ్చిన నిధులు ఎంత రాష్ట్రం వాటా ఎంత అని తెలుసుకొని మాట్లాడాలని టిపిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ పై నిప్పులు చెరిగారు. జూబ్లీ హిల్స్ లో ఓ అపార్టుమెంట్లో 43 ఓట్లు దొంగ ఓట్లు బయటపడితే, నిజామాబాద్ జిల్లా బోధన్ లో మాత్రం బిఅరెస్ హయాంలో 42 దొంగ పాస్ పోర్టులు ఇచ్చిన సంగతి మరిచారా అని గుర్తు చేశారు. బంగ్లాదేశ్ , మయన్మార్ దేశస్థులకు గతంలో ఆశ్రయం ఇచ్చింది బిఅరెస్ పార్టీనే అని ఆరోపించారు. అలాగే జూబ్లి హిల్స్ లో డ్రగ్స్, మత్తు పదార్థాల దందాలకు తెరలేపింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ క్లబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చెసింది స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి తనయుడు మాజీమంత్రి  కేటీఆర్ అని ఆరోపించారు. 42 శాతం బిసి రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతుందన్నారు. 42 శాతం అమలు ప్రాసెస్ కాంగ్రెస్ సరిగా చేయలేదు కానీ ఈ అంశంలో బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. జీల్లాలో ఇటీవల ముఖ్యమంత్రి పర్యటనతో ఒరిగిందేమి లేదని, జిల్లాలో ఆర్వోబీల నిధులు వెంటనే విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేపడతా అని హెచ్చరించారు.

దీపావళి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇస్తున్నానని, ఆర్వోబీల నిధులు కేంద్రం ఇచ్చినా...రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అవసరాలకు వాడుకుందన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న మాధవ్ నగర్, మామిడిపల్లి, అర్సపల్లి ఆర్వోబీల నిధులు కేంద్రం ఎప్పుడో డిపాజిట్ చేసిందని, గత ప్రభుత్వం వాడుకున్న డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం రికవరీ చేయాలన్నారు. పనుల కోసం వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు.

కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేస్తున్నారన్నారు. జిల్లాలో ఆర్వోబీల పనుల నత్తనడకకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం అని అన్నారు. ఇప్పటికైనా బాధ్యతగల అధికారిగా జిల్లా కలెక్టర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని కోరారు. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గద్దన్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాస్తవాలు తెలుసుకోకుండా చదువురాని ఆయన  కేంద్రం మీద తప్పుడు వాస్తవాలు మానుకోవాలని సూచించారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే  సూర్యనారాయణ గుప్త, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు పోతాన్కార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >