| Daily భారత్
Logo




ఐరాడ్, ఈడార్ లను విజయవంతంగా నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

News

Posted on 2025-10-17 11:49:26

Share: Share


ఐరాడ్, ఈడార్ లను విజయవంతంగా నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

మోడల్ జిల్లాగా ఏర్పాటుకు కృషి : పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ఐరాడ్, ఈడార్ ప్రాజెక్టుని నిజామాబాద్ జిల్లాలో జులై 2021 నుండి రోడ్డు ప్రమాదాల నివారణకు వాటిలో తీసుకోవలసిన జాగ్రత్తల కొరకు డేటా అనాలసిస్ కొరకు మొట్టమొదటిసారిగా భారతీయ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఈ ప్రాజెక్టులో వివిధ డిపార్టుమెంటుల సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకోవలసిన జాగ్రత్తలు అవగాహణ శిక్షణ మరియు సామూహిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులో పోలీస్ శాఖ, ట్రాన్స్ పోర్ట్ శాఖ, ఆరోగ్య శాఖ మరియు రహాదారుల శాఖల సమస్వయంతో పనిచేస్తాయన్నారు. ఈ ప్రాజెక్టులో నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలు అన్నీ కూడా మొదలు పెట్టినప్పటికీ నిజామాబాద్ జిల్లా ప్రగతిపధంలో దూసుకెళ్తుంది. నిజామాబాద్ జిల్లా తెలంగాణలో ప్రపాత్తమంగా మార్చ్ 23 నాటికి ప్రతీ విభాగాన్ని ఈ ప్రాజెక్టుకి అనుసంధానం చేసింది. దీని వలన ప్రప్రధమంగా ఐరాడ్, ఈడార్ అప్లికేషన్ ఉపయోగించి, బ్లాక్ స్పాట్స్ అనగా అత్యధిక ప్రమాదాలు జరిగే ప్రదేశాలు.మన నిజామాబాద్ జిల్లాలో బీటా వెర్షన్ ఉపయోగించే అతికొద్ది జిల్లాలలో ఒకటి అందువలన మనం తెలంగాణలో ఇతర జిల్లాలతో పోల్చినప్పుడు అందరికంటే ముందు ప్రగతిపధంలో దూసుకువెళ్తునమ్మన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోనే మొదటిసారిగా 50 కంటే ఎక్కువ ప్రమాదస్థలాలను జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కలిసి సందర్శించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పారు. దాదాపు 200 కన్న ఎక్కువ రోడ్డు ప్రమాద అవగాహన కార్యక్రమాలు పాఠశాలలు, కాలేజీలు మరియు సామూహిక ప్రదేశాలలో వివిధ శాఖల సమన్వయంతో 2021 నుండి ఇప్పటివరకు నిర్వహించారని పేర్కొన్నారు.

అవగాహన కార్యక్రమాలే కాకుండా వినూత్న రీతుల్లో ముందు కెళుతూ ఆర్మూర్ జక్రాన్ పల్లి, ఎడ్పల్లి నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిల్లో ప్రమాదాల నివారణకు డమ్మీ రోడ్డు ప్రమాద ప్రదర్శన ని నిర్వహించడం జరిగిందన్నారు. దీని వలన ఆ ప్రదేశంలో ప్రమాదాలు గనణీయంగా తగ్గాయన్నారు. మన నిజామాబాద్ జిల్లాని మోడల్ జిల్లాగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో పోలీసు మరియు జరిగిందన్నారు ట్రాన్స్పోర్టు విభాగాల అధికారులకు శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడం జరిగిందన్నారు.కార్యక్రమాలని ఎన్.ఐ.సి వెబ్సైట్ 2023లో ఇట్టి విషయాన్ని ప్రచురించారు. ఇందులో ఐరాడ్, ఈడార్ ప్రాజెక్టు గురించి ప్రచురించడం జరిగిందన్నారు. ఇట్టి కార్యక్రమం ముందుకు వెళ్లడానికి వివిధ విభాగాల సహకారంతో పాటు డి.సి.ఆర్.బి సహకారం గణనీయంగా ఉంటుందాన్నారు ఈ వివిధ విభాగాల సహకారంతో 2025 సంవత్సరంలో ఇప్పటివరకు ఏడు శాతం మరణాలు తగ్గినాయి. ఇది డిసెంబర్ చివరివారం వరకు 20 శాతం తగ్గేలా ప్రణాళికలు రూపొందించ బడుతున్నాయన్నారు. భవిష్యత్తులో ప్రమాదాల నివారణతో పాటు ప్రమాదంలో బాధితులకి మరియు వారికి అందించే సమయంలో కూడా ముందుంటూ యువతకు, విద్యార్థులకు అవగాహణ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిజామాబాద్ జిల్లాను " మోడల్ జిల్లాగా" సాగించేలా ప్రణాళికలు రూపొందించ బడుతున్నాయి అని అన్నారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >