Posted on 2025-10-17 16:15:05
డైలీ భారత్ న్యూస్, హన్మకొండ: మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లో నూతన సభ్యులను నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన హనుమకొండ జిల్లా మత్స్యశాఖ అధికారులను శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే నర్సంపేట మాదన్నపేటకు చెందిన మత్స్య పారిశ్రా మిక సంఘంలో నూతన సభ్యుల పేర్లను నమోదు చేయాలని ఆ సంఘం 2023లో జిల్లా కార్యా లయంలో వినతిపత్రం సమర్పించారు. అయితే అప్పటి అధికారి హైదరాబాద్ ప్రధాన కార్యాలవానికి పంపించేందుకు అన్ని సిద్ధం చేశాడు. ఈ క్రమంలోనే ఆ అధికారి బదిలీపై వెళ్లిపోయాడు. ఆ స్థానంలో నాగమణి వీధిలో చేరి సంవత్సరన్నర అయింది. అయితే గత అధికారి నమోదు చేయాలని సభ్యుల లిస్టు ఇచ్చామని ప్రస్తుత అధికారులు నమోదు చేయాలని సంఘ సభ్యులు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఫైల్ హైదరాబాద్ ప్రధాన కార్యాలనికి పంపించారు. అయితే అక్కడ అధికారులు జిల్లా పరిధిలోనే నమోదు చేసుకునే అధికారం జిల్లా డిఎఫ్ ఓ కు ఉందని తిరిగి ఆ ఫైలును పంపించారు. ఇదే అదనంగా భావించిన డిఎఫ్ నాగమణి సొసైటీ నుంచి రూ.80 వేల రూపాయలు లంచాన్ని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో సొసైటీ అధ్యక్షులు ఈ విషయంపై ఏసీబీ నాశ్రయించాడు. అందులో భాగంగానే శుక్రవారం కార్యాలయంలో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ హరీష్, డీ ఎఫ్ ఓ నాగమణి డబ్బులు తీసు కుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.జిల్లా అధికారిని నాగమణి ఆదేశాల మేరకు కొత్త సభ్యులను సొసైటీలో చేర్చడం కోసం తను లంచం డిమాండ్ చేసినట్లు హరీష్ ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరిని శనివారం ఏసీబీ కోర్ట్ లో హాజరు పరచ నున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి సాంబయ్య తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా పని కోసం లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తో పాటు ఎస్సై, కానిస్టేబుల్స్, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >