| Daily భారత్
Logo




బీసీల అన్ని వర్గాల ప్రజలతో రాష్ట్ర బంద్ ను విజయవంతం చేద్దాం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

News

Posted on 2025-10-17 16:55:05

Share: Share


బీసీల అన్ని వర్గాల ప్రజలతో రాష్ట్ర బంద్ ను విజయవంతం చేద్దాం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

డైలీ భారత న్యూస్, హైదరాబాద్:బీసీ రిజర్వేషన్స్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18వతేదీన (శనివారం)జరుపతలపెట్టిన రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభసభ్యులు,మున్నూరు

కాపు సంఘం గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర సబ్బండ వర్గాలకు పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ రంగాలలో 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తామంటూ  బీసీల ఓట్లు దండుకుని కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చారన్నారు.కాంగ్రెస్ 140 ఏళ్ల చరిత్రంతా కూడా మోసపూరితం,ద్రోహపూరితం అని ఒక ప్రకటనలో ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు.ఉమ్మడి రాష్ట్రంలో అవకాశాలు ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు.కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఆర్భాటంగా హామీలిచ్చి, మాయమాటలు చెప్పి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నారని కాంగ్రెస్ నేతల వైఖరిని ఆయన నిలదీశారు.పార్లమెంటులో చట్టం చేయడం, రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్ నందు పొందుపర్చడం ద్వారానే 42% రిజర్వేషన్స్ పెంపుదల సాధ్యమని బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా చెబుతూ వస్తున్నదన్నారు.మంత్రివర్గంలో సముచిత స్థానం ఇవ్వకుండా,ఇచ్చిన హామీ మేరకు వార్షిక బడ్జెట్ లో 20వేల కోట్లు కేటాయించకుండా, రిజర్వేషన్స్ పెంచకుండా కాంగ్రెస్ పాలకులు చేస్తున్న మోసాన్ని సబ్బండ వర్గాలు గుర్తించాయని ఎంపీ వద్దిరాజు చెప్పారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో బీసీలకు అన్ని రంగాలలో సముచిత గౌరవం లభించిందన్నారు.తనతో పాటు మరో నలుగురు బీసీ నాయకులు కే.కేశవరావు,డీ.శ్రీనివాస్,బండా ప్రకాష్ ముదిరాజ్,బడుగుల లింగయ్య యాదవ్ లను పెద్దల సభ రాజ్యసభకు పంపి గౌరవించారని  పేర్కొన్నారు.తెలంగాణ మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ గా మధుసూదనాచారి, కౌన్సిల్ ఛైర్మన్ గా స్వామి గౌడ్, హైదరాబాద్ మహా నగరానికి మేయర్లుగా బొంతు రాంమోహన్, విజయలక్ష్మీలను నియమించడాన్ని ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర ప్రస్తావించారు.అలాగే,మహిళలతో పాటు బీసీలకు చట్టసభల్లో 33 శాతం చొప్పున రిజర్వేషన్స్ అమలు చేయాలని కోరుతూ కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేశారని ఆయన వివరించారు.రిజర్వేషన్స్ పెంచిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలని,పార్టీల పరమైన రిజర్వేషన్లు బీసీలకు ఆమోదయోగ్యం కాదని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెడితే బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందని ఆయన తెలిపారు.రిజర్వేషన్స్ పెంపుదల విషయంలో కాంగ్రెస్ చేసిన, చేస్తున్న మోసాలను ఎండగడుతూ, రాజ్యాధికారంలో న్యాయమైన వాటా కోసం జరుప తలపెట్టిన రాష్ట్ర బంద్ లో భాగస్వాములై విజయవంతం చేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు మున్నూరుకాపులతో పాటు సబ్బండ వర్గాలకు పిలుపునిచ్చారు.ఈ బంద్ కు సంపూర్ణ సహకారం అందించాల్సిందిగా ఆర్టీసీ కార్మికులు,విద్యా సంస్థలు, ఉద్యోగులు,వ్యాపారస్తులు, సినిమా టాకీసుల యాజమాన్యాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >