Posted on 2025-10-17 17:23:57
డైలీ భారత్ న్యూస్,వరంగల్/ ఖనాపూర్ :వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. భోజన నాణ్యతను పరిశీలించి, కూరల రుచిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనును ఖచ్చితంగా పాటించాలన్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు.
కేజీబీవీ లో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తలుపులు, ఇనుప గ్రిల్స్, టాయిలెట్ల మనమ్మత్తులను, ఆరో ప్లాంట్, కిచెన్ రూఫ్ తదితర పూర్తయిన పనులను కలెక్టర్ పరిశీలించారు. కోతులు వస్తున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కోతులు రాకుండా వెంటనే మెష్ ఏర్పాటు చేయాలని డీఈ ను ఆదేశించారు.
వారంలో ఒకరోజు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ డేగా నిర్ణయించి ఆరోజు పిల్లలతో అదే భాష రోజు మొత్తం మాట్లాడించాలని, దీనితో వారి వకాబులరీ పెరుగుతుందన్నారు . విద్యార్థులతో ముచ్చటించి వారి పట్టణ సామర్థ్యాన్ని తెలుసుకొని ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. విద్యార్థులకు ఏమన్నా సమస్యలు ఉంటే ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ లో వేయాలన్నారు.
క్రీడల కొరకు వాలీబాల్ బాస్కెట్బాల్, ఖో ఖో కోర్టులు కావాలని విద్యార్థులు కలెక్టర్ ను కోరగా, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
తహసిల్దార్ రమేష్, టిఈడబ్ల్యూఐడిసి డిఈ అశోక్, జి ఈ సి ఓ ఫ్లోరెన్స్, ఎంఈ ఓ శ్రీదేవి స్పెషల్ ఆఫీసర్ మేనక, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >