Posted on 2025-10-19 12:29:44
పరారీలో ఉన్న హంతకున్ని 48 గంటల లోపే పట్టుకున్న పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన పాత నేరస్తులు రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ కేసులో రాష్ట్ర డిజిపి, డిఐజి త్వరగా ఈ కేసును చేదించాలని జిల్లా సీపీకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 9 బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో నిందితులు రియాజ్ ను ఆదివారం పట్టుకున్నట్లు తెలుస్తుంది. కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్ విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యోదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు రియాజ్ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.
పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‌ను శుక్రవారం (అక్టోబరు 17)న అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా.. కానిస్టేబుల్ ప్రమోద్‌పై నిందితుడు రియాజ్ కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ ప్రమోద్ను ఛాతిలో పొడిచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ పరిస్థితి విషమించడంతో మరణించారు. కాగా.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కమిషనరేట్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. డీజీపీ సైతం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. ఐజీని ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. అనంతరం నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఆరో ఠాణా పరిధిలో..
నిజామాబాద్ ఆరో ఠాణా పరిధిలో నిందితుడు రియాజ్ ఉన్నట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆరో ఠాణా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారని నిందితుడు రియాజ్ ఉపయోగించిన బైక్స్థానిక కెనాల్ సమీపంలో లభించింది. అంటే నిందితుడు కెనాల్‌లోని నీటిలో దూకి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో డ్రోన్ సాయంతో నిందితుడి కోసం జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సారంగపూర్ శివారులో పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నట్లు సమాచారం.
మరోసారి పోలీసులపై దాడికి తెగబడిన రియాజ్
పారిపోయే యత్నం లో యువకుడు ఫై కత్తి తో దాడి
ఆసుపత్రి కి తరలింపు .. తెగించి పట్టుకున్న ఇద్దరు పోలీసులు..?
సారంగాపూర్ శివారు లోనే ఓ లారీ క్యాబిన్ లో నుంచి దూకి పారిపోతున్న రియాజ్ మరోసారి కత్తి తో దాడికి తెగబడ్డాడు. రియాజ్ పారిపోతుండగా బైకు మీద వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటాడారు. పట్టుకోవాలంటూ ఆ వైపు వెళ్తున్న యువకులను పురమాయించారు ఈ క్రమంలో నెహ్రు నగర్ కు చెందిన అసిఫ్ రియాజ్ ను పట్టుకోవడానికి వెళ్లగా తన వద్ద ఉన్న కత్తి తో దాడి చెయ్యడంతో ఎడమ చెయ్యి తెగింది. ఈ లోపు కానిస్టేబుళ్లు రియాజ్ ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >