| Daily భారత్
Logo




పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం : ఎస్పీ మహేష్ బి. గీతే

News

Posted on 2025-10-21 08:59:19

Share: Share


పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం : ఎస్పీ మహేష్ బి. గీతే

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. జిల్లా పరిధిలోని చందుర్తి మండలం లింగంపెట గ్రామ శివారులో గల అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే)ను ఘనంగా నిర్వహించి, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులతో కలసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 08 మందికి పైగా పోలీసులు అసువులు బాసారని, వారి త్యాగఫలం వల్లే గతం కంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందని, పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత, రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు. దేశంలో విధి నిర్వహణలో మరణించిన192 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >